బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?

ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సామాన్యులు పరిగెత్తేది పోలీసుల దగ్గరకే. పోలీస్ స్టేషన్‌కి వెళితే దాడుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.

అందుకే ప్రాణాపాయం ఉన్నవారు, దాడి జరుగుతుందనే భయం ఉన్నవారు పోలీసుల దగ్గరకు వెళతారు. కానీ, పోలీసుల భద్రతలో ఉన్న వారి మీదే పోలీసుల సమక్షంలోనే దాడి జరిగితే?

ప్రస్తుతం తెలంగాణలో ఇవే ఘటనలు జరుగుతున్నాయి. రక్షక్ వాహనంలో కూడా రక్షణ లేకుండాపోయింది. తెలంగాణ పోలీసులపై కొత్త సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయి.

బైరి నరేశ్‌పై దాడి

వరంగల్ హనుమకొండ దగ్గర బైరి నరేశ్ అనే వ్యక్తిపై పోలీసు జీపులో ఉండగానే దాడి జరిగింది.

కొందరు వ్యక్తులు పోలీసు జీపును ఆపి, తలుపు తీసి లోపలికి వెళ్లి నరేశ్‌పై పిడి గుద్దులు కురిపించారు. బలంగా గాయపరచారు.

అడ్డుకోబోయిన పోలీసులను కూడా తోసేశారు. ఆ సమయంలో పోలీస్ రక్షక్ వాహనంలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఇది మొదటిది కాదు. గత నెల వికారాబాద్ దగ్గర యాలాల పోలీస్ స్టేషన్లో ఉన్న ఓ వ్యక్తిని కొందరు శివ మాల వేసుకున్న వారు స్టేషన్ ప్రాంగణంలోనే కొట్టారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశారు. కానీ, అంత మంది ముందు పోలీసుల బలం సరిపోలేదు. ఆ ఘటన మరువక ముందే తాజాగా హనుమకొండ ఘటన జరిగింది.

దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. దీన్ని పోలీసుల వైఫల్యంగా పలువురు నెటిజన్లు కామెంట్ చేయగా, మధ్య యుగాల నాటి శాస్త్రవేత్తలపై జరిగిన భౌతిక దాడులుగా పలువురు అభివర్ణించారు. (ఎంబెడ్ చేయాల్సిన లింకులు కింద ఇచ్చాను.)

"ఇలాంటి ఘటన ముందే జరుగుతుందని బైరి నరేశ్ ఊహించాడు, కాబట్టే రక్షణ కోరాడు. పోలీసులు నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే ఇది జరిగింది. లేకపోతే పోలీసుల సమక్షంలో దాడి ఎలా జరుగుతుంది? పోలీసులకు అధికారం ఇచ్చినా వైఫల్యం చెందారు. పోలీసులు, ప్రభుత్వం కంటే బలంగా ప్రైవేటు వ్యక్తులు ఉంటారా? ప్రభుత్వ బలం కంటే దాడులు చేసే ప్రైవేటు వ్యక్తుల బలం ఎక్కువగా ఉంటుదా?" అని తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు ప్రశ్నించారు.

"భౌతిక దాడులకు దిగడం అనాగరికం. ప్రజాస్వామ్యంలో మధ్య యుగాల నాటి చరిత్ర తగదు. ఏదైనా ఉంటే, చట్ట పరంగా వెళ్లాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఇది అరాచకానికీ, అలజడికీ, హింసకీ దారి తీస్తుంది. ఒకరు దాడి చేసి, మరొకరు ప్రతిదాడి చేసి.. ఇలా జరగుతూ పోతే సమాజం ముందుకు వెళ్లదు. శాంతి, ప్రజాస్వామ్యం ఉండవు. ఇప్పుడే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక మూక దాడులు పెరిగాయి. ప్రభుత్వాలు వాటిని అరికట్టాలి. కఠినంగా శిక్షించాలి" అన్నారు.

https://twitter.com/RSPraveenSwaero/status/1630281246046846977?t=hreoZzH8GGYxUje22HGOvg&s=08

అయితే ఈ ఘటన విషయంలో పోలీసుల తప్పు లేదు అంటున్నారు సుబేదారీ పోలీసులు.

"నరేశ్ భద్రత కావాలి అని కోరాడు. తను ఒక కార్యక్రమం నుంచి వెళుతూ నగరం దాటే వరకూ భద్రత అడిగాడు. దీంతో ఆయన్ను పోలీసు వాహనంలోనే తరలించాం. ఆయన రెగ్యులర్ పోలీసు భద్రతలో లేకపోయినా, సెక్యూరిటీ అడగ్గానే ఇచ్చాం. భద్రతగా ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లూ ఉన్నారు. అయితే దారిలో కొందరు వ్యక్తులు బండిని అడ్డగించి, పోలీసులను తోసేసి దాడి చేశారు. నరేశ్‌నుి కాపాడటానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నం చేశారు. దాడి ఊహించని విధంగా జరిగింది. మేం సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ అనూహ్యంగా జరిగిన దాడి అది. మా సిబ్బంది కూడా ఎక్కడా తగ్గకుండా దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు" అని బీబీసీతో చెప్పారు సుబేదారీ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ షుకూర్.

రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు చేసిన భక్తులు

పోలీసుల జీపును అడ్డగించిన ఘటన జరిగిన ప్రదేశం హనుమకొండ పరిధిలోకి వస్తుంది. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మంగళ వారం తెల్లవారుజామున వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

"పోలీసులు నరేశ్‌ను కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు. అది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనపై కేసు పెట్టాం. మొత్తం ఆరుగురిని అరెస్టు చేశాం. వారిని కోర్టులో ప్రవేశ పెడతాం" అని హనుమకొండ ఇనస్పెక్టర్ నరేంద్ర బీబీసీతో చెప్పారు.

బైరి నరేశ్ హిందూ దేవతలను కించ పరిచాడు అంటూ గతంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ కేసులో భాగంగా 45 రోజుల పాటూ జైల్లో ఉన్న నరేశ్, ఫిబ్రవరి 16వ తేదీన విడుదల అయ్యారు. ఆ తరువాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నరేశ్ అరెస్ట్ కాకముందు కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఆయనపై దాడి చేశారు. విడుదల తరువాత వరంగల్ దగ్గర్లో ఒక కాలేజీలో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

దీనిపై వరంగల్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+