మహిళపై పలుమార్లు రేప్: తిలక్ మునిమనవడిపై రేప్ కేసు
ముంబై: స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ముని మనవడు, కాంగ్రెస్ నేత రోహిత్ తిలక్‌పై అత్యాచారం కేసు నమోదైంది. సోమవారం రాత్రి ఆయనపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రోహిత్.. ఓ 40 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీసులు చెప్పారు. తనపై రోహిత్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు రోహిత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుణెలోని కస్బాపేట్ నియోజకవర్గం నుంచి రోహిత్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గిరీశ్ బాపట్ గెలుపొందారు.












Click it and Unblock the Notifications