• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమే

|

శ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటుంది ఆ చిన్న పట్టణం. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉంటుంది. జన సంచారం పెద్దగా ఉండదు. అక్కడ నివసించే ప్రజలకు పెద్దగా చదువు రాదు. కొత్తగా ఎవరైనా ఆ పట్టణాన్ని చూస్తే.. అదో పర్యాటక కేంద్రమేమో అని భావించేంత అందంగా ఉంటుంది. అలాంటి పట్టణం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. రెండు దేశాల ప్రజల నోళ్లల్లో నానుతోంది.

దీనికి కారణం- మనదేశ వైమానిక దళం.. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఏర్పాటైన ఉగ్రవాద శిబిరాలపై యథేచ్ఛగా దాడులు చేయడమే. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మిరేజ్, జెట్ ఫైటర్లు మొట్టమొదటగా దాడులు చేసింది ఇక్కడే. బాలాకోట్ చుట్టూ ఉన్న పర్వతాల్లో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలపై నిరంతరంగా దాడులు కొనసాగించాయి మనదేశ వైమానిక బలగాలు. దీనితో ఈ చిన్న పట్టణం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

బాలాకోట్.. మసూద్ అజర్ కు కంచుకోట

బాలాకోట్.. మసూద్ అజర్ కు కంచుకోట

పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలో ఉన్న మన్ సెహ్రా జిల్లాలోని చిన్న పట్టణం బాలాకోట్. మనదేశ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్ కు ఈ పట్టణం పెట్టని కోట. అజర్ సాగించిన ఉగ్రవాద కార్యకలాపాలకు బాలా కోట్ కేంద్రబిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2001 వరకూ అజర్.. కొన్నాళ్ల పాటు ఇదే పట్టణంలో నివసించాడు. ఆ సమయంలోనే బాలాకోట్ సహా చుట్టు పక్కల ఉన్న కొండ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని, జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేశాడు. ఉగ్ర కార్యకలాపానలు కొనసాగించాడు.

ర్యాలీలు, రిక్రూట్ మెంట్లూ ఇక్కడి నుంచే..

ర్యాలీలు, రిక్రూట్ మెంట్లూ ఇక్కడి నుంచే..

2001లో మౌలానా మసూద్ అజర్ ఈ పట్టణాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత.. జైషె మహమ్మద్ పేరిట తరచూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించేవాడని సమాచారం. బహిరంగ సభలను ఏర్పాటు చేసి, అక్కడి యువతను జైషె మహమ్మద్ పట్ల ఆకర్షితులయ్యేలా చేసే వాడని తెలుస్తోంది. బాలాకోట్ లోని బెస్యాన్ చౌక్ వద్ద అనేక సార్లు మసూద్ అజర్.. బహిరంగ సభలను నిర్వహించినట్లు సమాచారం ఉంది. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరదల్చిన యువకులు మొట్టమొదటి సారిగా బాలాకోట్ పరిసరాల్లో ఉన్న శిబిరాల్లోనే ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని భారీ ఎత్తున రిక్రూట్ మెంట్లు కొనసాగాయని అధికారులు చెబుతున్నారు.

దాడులు ఇక్కడి నుంచే..

దాడులు ఇక్కడి నుంచే..

జమ్మూకాశ్మీర్ సహా మనదేశ భూభాగం వెంట, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే భారత సైనిక శిబిరాలపై ఇక్కడి నుంచే దాడులు చోటు చేసుకునేవి. బాలాకోట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో జైషె మహమ్మద్ శిబిరాలు ఉన్న సమాచారం మనదేశ సైన్యం వద్ద ఉంది. అందుకే- బాలాకోట్ ను కేంద్రంగా చేసుకుని వైమానిక దళాలు దాడులు చేశాయి. తాజాగా చేపట్టిన ఈ దాడుల్లో జైషె మహమ్మద్ కు చెందిన మూడు ఆల్ఫా కంట్రోల్ రూములు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

లాడెన్ స్వస్థలానికి 50 కిలోమీటర్ల దూరం..

లాడెన్ స్వస్థలానికి 50 కిలోమీటర్ల దూరం..

కరడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ స్వస్థలం అబోట్టాబాద్. అమెరికా సైనికులు ఈ పట్టణంలోనే బిన్ లాడెన్ ను కాల్చి చంపాయి. ఈ అబోట్టాబాద్.. బాలాకోట్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాలాకోట్ లో విచ్చలవిడిగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం అనడంలో సందేహాలు అక్కర్లేదు. లాడెన్ సహా అల్ ఖైదా ఉగ్రవాదులు తరచూ బాలాకోట్ కు వచ్చేవారని, జైషె మహమ్మద్ కార్యకలాపాలను పర్యవేక్షించే వారని సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Balakot is a town in Mansehra District in the Khyber-Pakhtunkhwa province of Pakistan. According to reports, Masood Azhar used to time in Balakot in 2001. Balakot is also believed to be the home of Jaish-e-Muhammad camps which were operational and used as launchpads. It’s believed the IAF destroyed Alpha 3 Control Rooms and launchpads of JeM in Balakot. Intel on Balakot from 2001 onwards has shown that it’s the place for JeM rallies, training at facility at Besyan Chowk in Balakot. The attacks on LoC, against Americans in Afghanistan and in Pakistan were also believed to be planned here. It’s 50 km from Abbottabad, most famous for housing Osama Bin Laden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more