వ్యాపారి, కుటుంబం సూసైడ్: హైద్రాబాద్ పోలీసు మెడకు

Bangalore businessman blames Hyderabad cops in his suicide note
బెంగళూరు/హైదరాబాద్: కౌశిక్ అనే కర్నాటకకు చెందిన వ్యాపారవేత్త ఆరు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి.. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ కేసు హైదరాబాదుకు చెందిన ఓ పోలీసు అధికారి మెడకు చుట్టుకుంటోంది.

కౌశిక్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గత శుక్రవారం మృతి చెందారు. కౌశిక్ తన సూసైడ్ నోట్‌లో హైదరాబాదుకు చెందిన ఓ పోలీసు అధికారి పేరును ప్రస్తావించారట. హైదరాబాదు నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి తన ప్రాపర్టీని తన బంధువు పేర బలవంతంగా రాశారని నోట్‌లో ఆరోపించినట్లుగా తెలుస్తోంది. అయితే, కౌశిక్ ప్రస్తావించిన ఆ పోలీసు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.

కర్నాటకకు చెందిన రామనగర్ జిల్లా పోలీసులు ఈ కేసును తొలుత దర్యాఫ్తు చేశారు. ఆ తర్వాత సిఐడికి అప్పగించారు. దీనిని సిఐడి విచారణ జరుపుతోంది. మృతుడి నోట్ ఆదారంగా సదరు పోలీసును గుర్తించేందుకు బెంగళూరుకు చెందిన సిఐడి పోలీసులు హైదరాబాదుకు రానున్నారు. ఇప్పటికే వారు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.

కాగా, కౌశిక్ పునీత్ శర్మ (40), భార్య శ్రీలత (36), కూతురు శ్రీరక్ష (11), తనయుడు కస్తుబ్ (9)లు రామనగర జిల్లాలోని తాలగట్టాపూర్‌కు చెందిన వారు. వీరు శుక్రవారం తమ బంధువు ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. కౌశిక్ తన భార్య, పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఫ్యాన్‌కు ఉరేసికొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+