వీడో వెరైటీ దొంగ..అమ్మాయిల లోదుస్తులు దొంగలించి,ఛీ ఛీ..ఏం చేశాడంటే..!
బెంగళూరు: దొంగల్లో పలురకాల దొంగలు ఉంటారు. సినిమాల్లో ఉన్నట్లుగా మంచి దొంగ, జేబుదొంగ ఇలాంటి వారు. సాధారణంగా ఈ దొంగలు ఏదైతే టార్గెట్‌గా పెట్టుకుంటారో దాన్నే దొంగతనం చేసి పారిపోతారు. ఉదాహరణకు బంగారం దొంగతనం చేయాలనుకునే దొంగలు మహిళల మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లడం, బంగారు దుకాణాలకు కన్నాలు పెట్టి బంగారును దోచుకెళ్లడం వంటివి చేస్తారు. కానీ ఈ కథలో దొంగ మాత్రం చాలా వెరైటీ. ఇంతకీ ఆ దొంగ ఎవరో చూద్దాం.
బెంగళూరు మహానగరంలో దొంగల బెడద చాలానే ఉంది. తాజాగా పోలీసులు ఒక దొంగ కోసం తెగ వెతికేస్తున్నారు. కానీ దొరకడం లేదు. ఇంతకీ ఆ దొంగ చేసిన దొంగతనం ఏంటో తెలిస్తే అంతా నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ దొంగ బంగారమో, లేక డబ్బులో దొంగతనం చేయలేదు.. మహిళల లోదుస్తులను దొంగతనం చేశాడు. అవును మీరు చదివింది నిజమే. కేవలం మహిళల లోదుస్తులే ఇతని టార్గెట్. వాటిని దొంగలించి అదేంటో ఒకలాంటి సైకోతననాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడట.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ దొంగపై రాజగోపాల్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇళ్లు అద్దెకు తీసుకుంటాననే పేరుతో ముందుగా ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్లను టార్గెట్ చేస్తాడు. ఆ ఇంట్లో పురుషులు బయటకు వెళ్లగానే ఈ దొంగ నేరుగా ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. ఆ వెంటనే వారితో మాటలు కలిపి ఇంటిని చూడాలని చెప్పి నేరుగా ఇంటి వెనక్కు వెళతాడు. అక్కడ ఆరేసిన మహిళల లోదుస్తులను దొంగలించి కాసేపు అక్కడ అసభ్యకరమైన చర్యలు చేస్తాడని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ సైకో దొంగ ఇలాంటి అసభ్యకరమైన చర్యలు చేస్తుండగా అక్కడే నివాసముంటున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోను పోలీసులకు అందజేయడంతో అసలు కథ బయటపడింది.అయితే ఇప్పటి వరకు మహిళల లోదుస్తులు మాత్రమే దొంగలించాడన్న ఫిర్యాదు తప్ప మరో నేరం ఇతనిపై లేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ సైకో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications