బెంగళూర్ రేప్: స్కూల్ చైర్మన్ అరెస్టు, ఆందోళనలు
బెంగళూర్: ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పాఠశాల చైర్మన్‌ను బుధవారంనాడు అరెస్టు చేశారు. ఈ నెలారంభంలో విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై బెంగళూర్‌లో రోజు రోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి.
నిందితులను కాపాడుతున్నారంటూ ఆందోళనకారులు పాఠశాల యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బుధవారం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దారుణమైన అత్యాచార సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు.

కాగా, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు చదువు కొనసాగడానికి పాఠశాలను తెరవాలని అవసరం ఉందని వారంటున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచే యాజమాన్యం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పాఠశాల 2007 జూన్‌లో ప్రారంభమైంది. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ స్కూల్‌గా దాన్ని ప్రకటించారు. దాంతో తల్లిదండ్రులు పెద్ద యెత్తున తమ పిల్లలను చేర్పించారు. దానికి ఐసిఎస్ఇ స్కూల్‌గా వచ్చే ఏడాది నుంచి నడపడానికి మాత్రమే అనుమతి ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications