బెంగళూరు ఆర్ఆర్ నగర్ ఎమ్మెల్యే ఎన్నికలు, సీఎం కుమారస్వామి, మునిరత్న రహస్య చర్చలు!

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగర్ (ఆర్ఆర్ నగర్) శాసన సభ ఎన్నికలు ఈనెల 28వ తేదీ సోమవారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్బంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆర్ఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడుతో రహస్యంగా చర్చలు జరిపారు.

విధాన సౌధలో చర్చలు

విధాన సౌధలో చర్చలు

బెంగళూరు గ్రామీణ లోక్ సభ సభ్యుడు డీకే. సురేష్ ఆర్ఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడును పిలుచుకుని విధాన సౌధకు వెళ్లారు. సీఎం కుమారస్వామి, మునిరత్న నాయుడు, డీకే. శివకుమార్ విధాన సౌధలోని ప్రత్యేక గదిలో రహస్య చర్చలు జరిపారు.

ఒక్కరే పోటీ చెయ్యాలి

ఒక్కరే పోటీ చెయ్యాలి

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్బంలో ఆర్ఆర్ నగర్ లో రెండు పార్టీలు కలిసే పోటీ చెయ్యాలని సీఎం కుమారస్వామి మునిరత్నకు నచ్చచెప్పారని తెలిసింది. రెండు పార్టీలు కలిసిపోటీ చేసినప్పుడే బీజేపీని ఓడించడానికి అవకాశం ఉంటుందని కుమారస్వామి మునిరత్న నాయుడికి నచ్చచెప్పారని సమాచారం.

 జేడీఎస్ కు చాన్స్

జేడీఎస్ కు చాన్స్


ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు, జేడీఎస్ నుంచి సీహెచ్. రామచంద్ర, బీజేపీ నుంచి మునిరాజు గౌడ పోటీ చేస్తున్నారు. ఆర్ఆర్ నగర్ లో జేడీఎస్ అభ్యర్థి సీహెచ్. రామచంద్రకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇప్పించడానికి కుమారస్వామి చర్చలు జరుపుతున్నారు.

 కార్పొరేటర్లు వ్యతిరేకం

కార్పొరేటర్లు వ్యతిరేకం

ఆర్ఆర్ నగర్ శాసన సభ పరిధిలోని బీబీఎంపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జేడీఎస్ కు మద్దతు ఇవ్వరాదని, మీరే పోటీ చెయ్యాలని మునిరత్న నాయుడు మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అయితే మునిరత్న నాయుడిని పోటీ నుంచి తప్పించి జేడీఎస్ పార్టీ అభ్యర్థి సీహెచ్. రామచంద్రను గెలిపించాలని కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవి

ఎమ్మెల్సీ పదవి


ఆర్ఆర్ నగర్ శాసన సభ ఎన్నికల నుంచి తప్పుకుంటే మునిరత్న నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కుమారస్వామి హామీ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ విషయంపై కుమారస్వామి కానీ, మునిరత్న నాయుడు కాని అధికారికంగా దృవీకరించలేదు. మొత్తం మీద కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ఆర్ఆర్ నగర్ లో పోటీ చేసి బీజేపీని ఓడించాలని ప్లాన్ వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+