స్కూల్ లో మీటింగ్ కు వెళ్లిన భార్య, అపార్ట్ మెంట్ లో బ్యాంక్ జనరల్ మేనేజర్ ?, సీసీటీవీల్లో!

బెంగళూరు: మంగళూరు ప్రధాన కార్యాలయంలో కర్ణాటక బ్యాంక్ చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్ గొంతు చీలిపోయి అనుమానాస్పదంగా చనిపోవడం కలకలంరేపింది. మంగళూరులోని బొందెల్‌లోని ఓ అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉదయం గొంతు కోసిన బ్యాంక్ జనరల్ మేనేజర్ వాదిరాజా మృతదేహం లభ్యమైంది. పంప్‌వెల్ హెడ్‌క్వార్టర్స్‌లో చీఫ్‌ ఫిర్యాదుల అధికారిగా పనిచేస్తున్న వాదిరాజా (51) శవమై కనిపించడంతో బ్యాంక్ అధికారులు హడలిపోయారు.

ఉదయం 10 గంటలకల్లా వాదిరాజ్‌ భార్య తమ పిల్లలతో కలిసి స్కూల్‌లో పేరెంట్‌ మీటింగ్‌ కోసం బయలుదేరింది. అప్పుడు ఇంట్లో వాదిరాజ్ ఒక్కడే ఉన్నాడు. బ్యాంకు డ్రైవర్ వాదిరాజ్ దిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. వాదిరాజ్ ఇంకా రాకపోవడంతో డ్రైవర్ వెళ్లి చూసే సరికి గొంతు కోసిన పరిస్థితిలో కనిపించాడు. కారు డ్రైవర్ వెంటనే స్థానికుల సహాయంతో బ్యాంకు అధికారి వాదిరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు.

Bank general manager found dead suspiciously after throat slit in Mangaluru apartment

తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే వాదిరాజ్ చనిపోయాడు. మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గత ఏడాది కాలంగా వాదిరాజ్‌ కుటుంబం బొందెల్‌ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు నివసిస్తోంది. వాదిరాజ్ మంగళూరు నగరంలోని పంప్‌వెల్‌లోని కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నాడు.

కానీ ఇప్పుడు వాదిరాజ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో అందరూ హడలిపోయారు. కర్ణాటక బ్యాంక్ జనరల్ మేనేజర్ వాదిరాజా మృతిపై మంగళూరు నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ వాదిరాజ్ ఆచార్య అలియాస్ వాదిరాజ్ ఏడాదిగా ఇక్కడే అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. కర్ణాటక బ్యాంక్‌లో చీఫ్‌ ఫిర్యాదుల అధికారిగా ఉన్నారని, నాలుగేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారని చెప్పారు.

స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ కు వాదిరాజ్ భార్య ఆమె పిల్లలతో కలిసి వెళ్లింది. ఇంట్లో వాదిరాజ్ ఒక్కడే ఉన్నాడు. కారు డ్రైవర్ ఇంటికి వచ్చి చూడగా వాదిరాజ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందిందని, అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వారు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని, వాదిరాజ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోీసులు తెలిపారు.

పోస్టుమార్టం కూడా పెండింగ్‌లో ఉందని, నివేదిక వచ్చిన తర్వాతే వాదిరాజ్ మరణానికి గల కారణాలను తెలుస్తాయని, కడుపు, మెడపై కత్తితో కోసిన గాయం ఉందని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తామని, అపార్ట్ మెంట్ లో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, వాదిరాజ్ రాత్రి నుంచి చనిపోయే ఉదయం వరకు మొబైల్ ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారో దర్యాప్తు చేస్తున్నామని మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+