వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె: ఖాళీగా కుర్చీలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగారు. దీంతో చాలా బ్యాంకులకు తాళాలు పడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేటు బ్యాంకులు మాత్రమే పనిచేస్తున్నాయి. చెక్కుల క్లియరెన్స్, నగదు జమ తదితర పనుల విషయంలో కొంత వరకు ఖాతాదారులు ఇబ్బందిపడినా ఏటీఎంలు మామూలుగా పనిచేస్తుండటంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు.

బ్యాంకు ఉద్యోగుల ఒక రోజు సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 21 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. హైదరాబాద్ లోని కోఠిలో పలు బ్యాంకుల సిబ్బంది మహా ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో సైతం సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఉద్యోగులు చేసిన ధర్నా ఫలితంగా హైవేపై రాకపోకలు కొద్దిసేపు నిలిచాయి.

దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు తమ కార్యలయాల ఆవరణలో సమ్మె, ధర్నాలు చేపట్టారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చలు విఫలమైనందున సమ్మె మినహా ఉద్యోగులకు వేరే మార్గం లేదని యునైటెడ్ పోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎం.వి మురళీ తెలిపారు.

వేతన పెంపు 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించుకున్నా ఐబీఏ మాత్రం 11 శాతానికి మించి పెంచడానికి ఇష్టపడడం లేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ పేర్కొంది. సమ్మె కారణంగా దేశంలో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోనున్నాయని అంచనా.

దేశంలోని 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, 14 ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల సిబ్బంది ఈ సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. 9 బ్యాంకింగ్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటుండగా తెలంగాణలో సుమారు 40వేల మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.

వేతనాల పెంపు విషయమై డిసెంబర్ 2వ నుంచి బ్యాంకు ఉద్యోగులు జోనల్ వారీగా సమ్మెకు దిగనున్నారు. ఒక్కో రోజు ఒక్కో జోన్‌లో సమ్మె చేయనున్నారు. నాలుగు రోజుల పాటు జోనల్ సమ్మె చేసినప్పటికీ ఐబీఏ దిగిరాక పోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు బ్యాంకింగ్ ఉద్యోగులు తెలిపారు. దేశవ్యాప్తంగా 50 వేల బ్యాంకింగ్ శాఖల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లోని కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోసిపోయి ఉన్న దృశ్యం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లోని కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోసిపోయి ఉన్న దృశ్యం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


దేశవ్యాప్తంగా 21 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. హైదరాబాద్ లోని కోఠిలో పలు బ్యాంకుల సిబ్బంది మహా ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


దేశవ్యాప్తంగా 21 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. ఇందులో భాగంగా కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మె చేస్తున్న దృశ్యం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


9 బ్యాంకింగ్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటుండగా తెలంగాణలో సుమారు 40వేల మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


హైదరాబాద్‌లోని కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జనాలు లేక బోసిపోయి ఉన్న దృశ్యం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


హైదరాబాద్‌లోని కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జనాలు లేక బోసిపోయి ఉన్న దృశ్యం.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె


బ్యాంక్ ఉద్యోగులు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్ లోని కోఠిలో పలు బ్యాంకుల సిబ్బంది మహా ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

English summary
Dealers are bracing for low volumes across all markets in India on Wednesday as unions at most banks have called for a nationwide strike that is expected to leave trading rooms with minimal staffing but not shut down activity altogether.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X