Bank చార్జీల షాక్.. ప్రజల నుంచి రూ.21,000 కోట్ల వసూలు!

బ్యాంక్ (Bank) ఖాతా తెరిస్తే సేవలు ఉచితం అన్న భావన ఇప్పుడు చరిత్రగా మారుతోంది. ఖాతాలో కనీస నగదు నిల్వలు లేకపోయినా, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చినా, పాన్-ఆధార్ లింక్ ఆలస్యమైనా.. ప్రతిదానికి ఒక రుసుము. ఈ రుసుముల రూపంలో గత కొన్నేళ్లలో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వలు లేని ఖాతాలపై గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.8,092 కోట్లకు పైగా చార్జీలు వసూలు చేశాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. ఈ వసూళ్లు సంవత్సరానికోసారి గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Banks Charge Even Without Money in Account Rs 21 481 Crore Collected via Penalties and Fees in Recent Years

Bank ఛార్జీలుపై వివరాలు..

2022-23లో కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి రూ.2,407.82 కోట్లు, 2023-24లో రూ.2,909.10 కోట్లు, 2024-25లో రూ.2,775.91 కోట్లు.. బ్యాంకులు వసూలు చేశాయి. అంటే ఖాతాలో డబ్బు లేకపోయినందుకే మూడేళ్లలో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఖాతాల్లో చేరినట్లే.

ఇక మొబైల్ ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకూ ఖర్చే. ఖాతాదారులకు సందేశాలు పంపినందుకు బ్యాంకులు రుసుముల పేరుతో భారీగా వసూలు చేశాయి.

  • 2022-23లో రూ.1,193.19 కోట్లు
  • 2023-24లో రూ.976.98 కోట్లు
  • 2024-25లో రూ.1,217.60 కోట్లు

మొత్తంగా ఎస్‌ఎంఎస్ సౌకర్యం ఒక్కటే ప్రజలపై వేల కోట్ల భారం వేసింది.

బ్యాంకులకే కాదు, ప్రభుత్వ విధానాల్లో ఆలస్యం చేసినవారిపైనా భారీ వసూళ్లు జరిగాయి. పాన్ - ఆధార్ లింక్ చేయడంలో జాప్యం చేసిన ప్రజల నుంచి 2022-23 నుంచి 2024-25 మధ్య రూ.2,335.75 కోట్లు ఫీజులు వసూలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా, ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసిన వారిపై విధించిన రుసుముల ద్వారా 2021-22 నుంచి 2024-25 మధ్య రూ.7,664.94 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని తెలిపారు.

మొత్తం రూ.21,481.29 కోట్లు..

మంత్రి వెల్లడించిన గణాంకాలన్నింటినీ కలిపి చూస్తే, కనీస బ్యాలెన్స్ చార్జీలు, ఎస్‌ఎంఎస్ ఫీజులు, పాన్-ఆధార్ ఆలస్యం, రిటర్న్‌ల జాప్యం-ఈ నాలుగు అంశాల ద్వారానే బ్యాంకులు, ప్రభుత్వం కలిసి ప్రజల నుంచి మొత్తం రూ.21,481.29 కోట్లు వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఈ గణాంకాలు ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సేవల పేరుతో వసూలు చేస్తున్న ఈ రుసుములు సామాన్య ఖాతాదారుడిపై ఎంత మేర భారం మోపుతున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+