Banks Privitisation:బ్యాంకులు ప్రైవేటీకరణ యోచనలో కేంద్రం..నీతి ఆయోగ్ సూచనలేంటి..?

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశంపై చాలా ఫోకస్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లోని ఆయా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ విమర్శల పాలైంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ప్రైవేటీకరణ అంశంకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఓవర్సీబ్యాంకులో ఉన్న ప్రభుత్వ వాటాలను లేదా పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ నివేదించింది.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామంటూ తెలిపారు. అంతేకాదు ఒక బీమా సంస్థను కూడా 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరణ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ప్రభుత్వరంగా సంస్థల పాలసీలో భాగంగా ఏ సంస్థలను విలీనం చేయొచ్చు, ఏ సంస్థలను ప్రైవేటీకరణ చేయొచ్చు, ఏ సంస్థలను మరో సంస్థ కింద సబ్సిడరీగా చేర్చొచ్చు అనే అంశాలపై క్షుణ్ణంగా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని కోరింది.

Banks Privatisation:Check which banks will be privitised,here are Niti Aayog recommendations

ఇదిలా ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నీతి ఆయోగ్ సూచించగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏకంగా అమ్మకానికే పెట్టాలని నీతి ఆయోగ్ సూచించనట్లు ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో పేర్కొంది.

ఇక నీతి ఆయోగ్ సూచనలతో పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ, ఆర్థికసేవల శాఖ నీతిఆయోగ్ ప్రతిపదానలను పరిశీలించనుంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు ఏమైనా చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందా అన్న అంశంపై స్టడీ చేస్తాయి. అయితే ఈ చట్ట సవరణలు చేసిన తర్వాత బ్యాంకుల ప్రైవేటీకరణ ఘట్టం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా చర్చించాలని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+