Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జపాన్ నుంచి మోదీ తిరిగొచ్చిన కొన్ని నిమిషాల్లోనే.. కేంద్రం సంచలన నిర్ణయం..!!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడింది. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరు కావడానికి జపాన్ వెళ్లిన మోదీ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తరువాత దేశ రాజధాని వేదికగా చకచకా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పీఎఫ్ఐ నిషేధం..

పీఎఫ్ఐ నిషేధం..

ఊహించినట్టే- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధం వేటు పడింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలన్నింటినీ నిషేధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అమిత్ షా పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను కొద్దిసేపటి కిందటే జారీ చేసింది. ఈ నిషేధం అయిదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత పీఎఫ్ఐ తాజా పరిస్థితులను సమీక్షించిన తరువాత నిషేధాన్ని ఎత్తివేయడమా? లేక పొడిగించడమా? అనే విషయంపై కేంద్రం తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటుంది.

 మోదీ తిరిగొచ్చిన వెంటనే..

మోదీ తిరిగొచ్చిన వెంటనే..

ప్రధాని మోదీ తన జపాన్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే- పీఎఫ్ఐ నిషేధంపై హోం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీఎఫ్ఐ- దాని అనుబంధ అసోసియేషన్లపై నిషేధాన్ని వర్తింపజేసింది కేంద్రం. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద వాటిపై నిషేధాన్ని విధించినట్లు తెలిపింది. పీఎఫ్ఐ బ్యానర్ కింద ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టినా అవన్నీ చట్ట విరుద్ధమే అవుతాయి.

 ఐసీస్‌తోనూ..

ఐసీస్‌తోనూ..

ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన నివేదిక ప్రకారం చూసుకుంటే- పీఎఫ్ఐ గల్ఫ్ దేశాల్లో ఇండియా ఫ్రటర్నిటీ ఫోరమ్, ఇండియన్ సోషల్ ఫోరమ్, రిహాబ్ ఇండియన్ ఫౌండేషన్ పేర్లతో మూడు సంస్థలను నడుపుతోంది. గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని, ఈ సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్‌)లో కూడా చేరారంటూ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. సిరియా, ఇరాక్‌లలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉగ్రవాద సంస్థలతో..

ఉగ్రవాద సంస్థలతో..


పీఎఫ్‌ఐకి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని హోం శాఖ అధికారులు వివరించారు. భారత్‌లో పలు క్రిమినల్, ఉగ్రవాద కేసుల్లో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని, రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతోందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నట్లు అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం ధృవీకరించినట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు విఘాతమంటూ పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిషేధించినట్లు తెలిపారు.

వందలాది మంది అరెస్ట..

వందలాది మంది అరెస్ట..

పీఎఫ్ఐ ప్రతినిధులు, కార్యకర్తల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా వేట కొనసాగించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రెండు విడతల్లో నిర్వహించిన ఈ గాలింపు చర్యల సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు. కర్ణాటక, కేరళల్లో పెద్ద ఎత్తున అరెస్టులు నమోదయ్యాయి. అటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్‌లల్లో పెద్ద సంఖ్యలో పీఎఫ్ఐ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు.

పీఎఫ్ఐతో పాటు

పీఎఫ్ఐతో పాటు


పీఎఫ్ఐతో పాటు రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అండ్ రిహాబ్ ఫౌండేషన్, దాని అనుబంధ సంఘాలపై కేంద్రం నిషేధం విధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+