క్షవరం చేయనన్నందుకు కాల్చి చంపేశారు

బులంద్‌షహర్: క్షవరం చేయలేదన్న కారణంతో ఓ వ్యక్తి బార్బర్(మంగళి)ను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢకర్ అనే గ్రామంలో షారుఖ్ అనే వ్యక్తి కటింగ్ సెలూన్‌ను నడుపుకుంటున్నాడు.

కాగా, సలీం అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కటింగ్ కోసం అతని షాపునకు వెళ్లారు. వీరంతా మొదట తమకంటే తమకే ముందుగా క్షవరం చేయాలని షారుఖ్‌ను ఇబ్బంది పెట్టారు.

Barber shot dead by client for refusing to serve out of turn

ముగ్గురు వ్యక్తుల తీరుతో విసుగెత్తిన షారుఖ్.. ఎవరికీ కటింగ్ చేయనని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో షారుఖ్‌పై కాల్పులు జరిపాడు.

తీవ్రగాయాలైన షారుఖ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఖుర్జా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+