లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సీఎం, తప్పుడు మాటలు !
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 15వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారని, తప్పుడు రాజకీయాలు చెయ్యడానికి ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
కర్ణాటక బడ్జెట్ 2024పై మాట్లాడిన మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి, విమర్శించడానికే ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం. సిద్ధరామయ్య బడ్జెట్ పవిత్రతను అపవిత్రం చేశారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు పొందడానికి అనేక వేదికలు ఉన్నాయని, జీఎస్టీ కౌన్సిల్ ఉందని, నీతి ఆయోగ్ ఉందని బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

నీతి ఆయోగ్ సమావేశానికి ఒక్కసారి కూడా హాజరుకాకుండా సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం గురించి ఇలా పచ్చి అపద్దాలు మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ఆరోపణలు చెయ్యడానికే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని, బడ్జెట్‌ను రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఖండనీయమని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. అప్పులు ఎక్కువ చేస్తున్న సీఎం సిద్దరామయ్య కర్ణాటక ప్రజలను మోసం చెయ్యడానికే ఇలాంటి తప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు
గత ఏడాది కంటే దాదాపు 25 వేల కోట్ల రూపాయలు ఎక్కువ రుణం తీసుకున్నారని, అందులో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే అభివృద్ధికి వినియోగిస్తామని సిద్దరామయ్య అన్నారని, గతేడాది మూలధన వ్యయం 54 వేల కోట్లు కాగా, ఈ ఏడాది 55 వేల కోట్లకు మాత్రమే పెంచారని, చాలా ఎక్కువ రేట్లకు వడ్డీ రుణాలు తెచ్చి ఉత్పత్తి లేని ఖర్చులకు బడ్జెట్ డబ్బును ఖర్చు చేస్తున్నారని, ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారిందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక ప్రభుత్వం మీద మండిపడ్డారు.
రూ 14 వేల కోట్ల పన్ను వసూళ్లు కొరవడిందని సీఎం సిద్దరామయ్య స్వయంగా చెప్పారని బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు. రూ 1. 75 లక్షల కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ రూ 1. 61 లక్షల కోట్ల పన్ను మాత్రమే వసూలైందని, ఇలా రూ 14 వేల కోట్లు పన్ను వసూళ్లు తక్కువ అయ్యిందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ పూర్తిగా వచ్చిందని, వారి పన్ను వసూళ్లలో లోటు ఉందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

శుక్రవారం సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టింది తప్పుడు బడ్జెట్ అని, అందులో కూడా విద్య, నీటిపారుదల శాఖకు డబ్బు ఇవ్వలేదని, రాష్ట్రాన్ని దివాళా తీయించారని మాజీ సీఎ: బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, కృష్ణా, తుంగభద్రా, మహదాయి పథకాలకు ఏమాత్రం నిధులు ఇవ్వలేదని, సాగునీటికి పూర్తిగా అన్యాయం చేశారని, ఎస్సీ ఎస్టీలకు, విద్యార్థులకు, రైతులకు, మహిళలకు ఈ బడ్జెట్ జీరో నిధులు కేటాయించారని, కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇలాంటి చెత్త బడ్జెట్ ఎవ్వరూ ప్రవేశపెట్టలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు.
సిద్దరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి సిద్దరామయ్య ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. శుక్రవారం సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ నాయకులతో పాటు జేడీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications