మోదీ చచ్చిపోవాలని కోరుకుంటారా?, ఆ సునామిలో మీరు ఏమైపోతారో తెలుసా?, మాజీ సీఎం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చచ్చిపోవాలనుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు దిగజారిపోయాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హవేరీ-గదగ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు. హవేరి జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ చనిపోతే బీజేపీ నుంచి ఎవరూ ప్రధాని కాలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పందించారు. ఇలాంటి ప్రకటనలు ఎవ్వరూ చేసినా తప్పే అని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ చనిపోవాలనుకునే స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారంటే అలాంటి వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు వింటే కాంగ్రెస్ నాయకుల రాజకీయం ఏ స్థాయికి వెళ్తోందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. మీరు విమర్శించినంత మాత్రాన ప్రధాని మోదీ, ప్రత్యర్థులు ఎవరు మీ చావును కోరుకోరని, మోదీని మీరు ఎంత తక్కువ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తే అంత పెద్దవాడు అయ్యాడని, మళ్లీ మళ్లీ గెలిచారని, మోదీ ఆయుషు, ఆయన వయసు ఇంకా పెరుగుతుందని, ఆయన ఆరోగ్యం బాగుంటుందని బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని మోదీ వేవ్ సునామీలా మారిందని, ఆ వేవ్‌లో మీరు కొట్టుకుపోతామన్న భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతోందని మాజీ ఎమ్మెల్యే ఓలేకర్ చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు స్పందించిన బపవరాజ్ బోమ్మయ్ నెహ్రూ ఓలేకర్ మా పార్టీలో ఉన్నారని, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటారని, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినా రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తేల్చి చెప్పారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications