300 మంది యువతులపై అత్యాచారం.. బస్తీలో బయటపడ్డ అరాచక పర్వం!
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో వెలుగుచూసిన ఓ దారుణమైన లవ్ జిహాద్, సెక్స్ ట్రాఫికింగ్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుమారు 300 మందికి పైగా అమాయక యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఒక ముఠా ఆగడాలు బయటపడ్డాయి. బస్తీ జిల్లాకు చెందిన అజ్ఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి, తన అనుచరులతో కలిసి ఒక భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని, వారిని ప్రేమ,పెళ్లి పేరుతో లోబరుచుకుని, ఆపై వారిని వ్యభిచార కూపంలోకి నెట్టడమే ఈ ముఠా ప్రధాన పని.
చేతికి దారం కట్టుకుని.. హిందువుగా నమ్మించి..
ముఖ్య నిందితుడు అజ్ఫరుల్ హక్ యువతులకు తనను తాను హిందువుగా పరిచయం చేసుకునేవాడు. యువతులకు అనుమానం రాకుండా ఉండేందుకు చేతికి హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్ర దారం కట్టుకునేవాడు. బాధితుల్లో ఒకరైన ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగినికి 2022లో పరిచయమైన ఈ నిందితుడు, ఆమెకు మెరుగైన ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని, ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీశాడు.

అశ్లీల వీడియోలే ఆయుధంగా..
నిందితులు యువతులతో గడిపిన వ్యక్తిగత క్షణాలను వీడియోలు తీసి.. వాడిని సోషల్ మీడియాలో పెడతామని లేదా కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించేవారు. ఈ బ్లాక్ మెయిలింగ్‌తో యువతులను లొంగదీసుకుని వారిని బలవంతంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు, అలాగే నేపాల్ వంటి విదేశాలకు వ్యభిచారం కోసం పంపించేవారు. నిందితుడి సోదరుడు, కుటుంబ సభ్యులు కూడా ఈ అరాచకాల్లో పాలుపంచుకున్నట్లు బాధితురాలు ఆరోపించింది.
విచారణలో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు
ప్రధాన నిందితుడు అజ్ఫరుల్ హక్ పోలీసు రికార్డుల్లో ఇప్పటికే ఒక రౌడీ షీటర్. అతనిపై గతంలోనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుడు, అతని ముఠా ఇప్పటివరకు సుమారు 300 మంది యువతులను ఇలాగే ట్రాప్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. బాధితురాలు పెళ్లి చేసుకోవాలని నిందితుడి ఇంటికి వెళ్లగా.. అక్కడ నిందితుడి సోదరుడు, ఇతర అనుచరులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల చర్యలు
ఈ ఉదంతం బయటపడటంతో పోలీసులు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అజ్ఫరుల్ హక్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు."మహిళ ఫిర్యాదు మేరకు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ రాకెట్ వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో డిజిటల్ సాక్ష్యాలను, కాల్ డేటాను విశ్లేషిస్తున్నాం." అని డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర భూషణ్ తివారీ వెల్లడించారు. నమ్మించి వంచించే ఇలాంటి ముఠాల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణలో ఇంకా ఎంతమంది యువతుల జీవితాలు బలైపోయాయనేది తేలాల్సి ఉంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications