బంగాళాఖాతంలో ఆవర్తనం- భారీ వర్షాలు

Cyclone Shakti: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని అటు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్- నికోబార్‌ అంతటా రుతు పవనాలు విస్తరిస్తోన్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. క్రమంగా- జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే.. మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వివరించింది.

Bay of Bengal Yellow alert for 16 districts of Tamil Nadu

అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 20- 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడనుంది.. అల్పపీడనంగా మారనుంది. 23 నుంచి 28వ తేదీల మధ్య తుఫాన్ గా ఆవిర్భవించడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. దీనికి శక్తి అని పేరు పెట్టారు (Cyclone Shakti).

బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం గగనతలంపై 1.5 నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తున ఆవరించింది ఉందీ ఆవర్తనం. ఇది మరింత బలపడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. మూడు రాష్ట్రాలు- ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

దీని ప్రభావం ఏపీ సహా దక్షిణాదిన మూడు రాష్ట్రాలపై పడింది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంగళూరులో వర్షం దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్ కత నైట్ రైడర్స్ మ్యాచ్ ఆలస్యమైంది.

రుతు పవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావం తమిళనాడుపై అధికంగా కనిపిస్తోంది. కృష్ణగిరి, తిరుపత్తూరు, ధర్మపురి, సేలం, కాళ్లకురిచ్చి, నామక్కల్, తిరుచిరాపల్లి, పెరంబలూరు, అరియలూరు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, మైలాడుథురై, నాగపట్టిణం జిల్లాలు, కారైకల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

చెన్నైలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కనిపించిందాయా జిల్లాల్లో. తిరువణ్ణామలై జిల్లా చెంగంలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

కృష్ణగిరి, తిరువణ్ణామలై జిల్లాలోని జమునమరథూర్, ధర్మపురి జిల్లా హోగ్గెనెకల్, కడలూర్ జిల్లా పెలందురై, కృష్ణగిరి జిల్లాలోని పాంబర్ డ్యామ్ లల్లో 7 నుంచి 9 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టరేట్ వెల్లడించింది.

అటు బెంగళూరులోనూ ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. ఇందిరానగర్, జేపీ నగర్, విద్యారణ్యపుర, హెబ్బాళ, యలహంక, వైట్ ఫీల్డ్, వర్తూరు, సర్జాపురా రోడ్, మార్థహళ్లి, బెళ్లందూరు, బొమ్మనహళ్లి, బీటీఎం లే అవుట్, జయనగర, కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లల్లో భారీ వర్షాలు పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+