కరోనా ఎఫెక్ట్ : మోదీ స్పీచ్‌కి ముందు.. తర్వాత.. హతవిధీ.. ఏంటీ పరిస్థితి..

కరోనా ఎఫెక్ట్ కొత్త కష్టాలను తీసుకొస్తోంది. ఓవైపు వైరస్‌పై అపోహలు,భయాందోళనలు.. మరోవైపు వైరస్ నివారణపై లేనిపోని ప్రచారాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతుండటంతో.. ప్రజలు నిత్యావసరాల కోసం ఎగబడుతున్నారు. ఏ క్షణాన ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో.. నెల,రెండు నెలలకు సరిపడా కిరాణ వస్తువులను ముందే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(మార్చి 19) జాతిని ఉద్దేశించి మాట్లాడటం కంటే ముందు మొదలైన ఈ పరిస్థితి.. ఆ తర్వాత కూడా కొనసాగుతోంది.

కరోనా ఎఫెక్ట్ : ఆస్ట్రేలియాలో 'టాయిలెట్ పేపర్' వెర్రి.. పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే..

మోదీ విజ్ఞప్తి చేసినా వినిపించుకోని జనం..

మోదీ విజ్ఞప్తి చేసినా వినిపించుకోని జనం..

ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రజలు అనవసర భయాందోళనకు లోనై కిరాణ వస్తువులు,నిత్యావసర వస్తువుల కోసం హడావుడి పడవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతానికి నిత్యావసర వస్తువులకు దేశంలో ఎటువంటి లేదని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందే ప్రజల్లో హడావుడి మొదలైంది. గురువారం రాత్రి మోదీ తన స్పీచ్‌లో భారత్ లాక్‌డౌన్ ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఫలితంగా ప్రజలు నిత్యావసర వస్తువులపై ఆలోచనలో పడ్డారు. ముందు జాగ్రత్తగా నెల,రెండు నెలలకు సరిపడా కిరాణ వస్తువులు కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.

ప్రధాన నగరాల్లో సూపర్ మార్కెట్లకు ఉరుకులు పరుగులు

ప్రధాన నగరాల్లో సూపర్ మార్కెట్లకు ఉరుకులు పరుగులు

మోదీ స్పీచ్‌కు ముందు న్యూఢిల్లీ,ముంబై,బెంగళూరు నగరాల్లో ప్రజలు సూపర్ మార్కెట్లు,కూరగాయల మార్కెట్లకు పరుగులు పెట్టారు. అలాగే పెట్రోల్ బంకులకు కూడా క్యూ కట్టారు. ఇంటికి అవసరమయ్యే ఉప్పులు,పప్పులు,బియ్యం,పెట్రోల్ ఇలా తదిరత సామాగ్రి కొనుగోలు కోసం హడావుడి చేశారు. సూపర్ మార్కెట్లలోనూ కిరాణ వస్తువులు స్టాక్ అయిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో జనం మరింత ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన సూపర్ మార్కెట్ల ఖాళీ షెల్ఫ్ ఫోటోలను చూసి నిజమేనని నమ్మేశారు. దీంతో ఉరుకులు పరుగుల మీద సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.ఢిల్లీలో సబ్సిడీ కిరాణ వస్తువులను సప్లై చేసే కేంద్రీయ భండార్‌కి దాదాపు 100 పైచిలుకు కస్టమర్స్ ఒకేసారి వచ్చారు. దాదాపు 50కేజీల గోధుమ పిండి,10 లీటర్ల ఆవ నూనె,20 కేజీల పప్పులు తదిరత కిరాణ వస్తువులు కొనుగోలు చేశారు. అలాగే సౌత్ ఢిల్లీలోని అలకనంద మార్కెట్‌కి కూడా కస్టమర్లు పోటెత్తారు. గతంలో ఏ రోజూ లేనివిధంగా రోజంతా మార్కెట్ కిక్కిరిసిపోయింది. ఇక కోల్‌కతాలోని న్యూ మార్కెట్,సీల్‌దాహ్ మార్కెట్,భవానీపూర్ మార్కెట్లలో కిరాణ వస్తువులు,కూరగాయల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

కర్నూలులోనూ అదే పరిస్థితి

కర్నూలులోనూ అదే పరిస్థితి

ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిత్యావసరాలు,కిరాణ వస్తువుల కోసం హడావుడి వద్దని మోదీ విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎప్పుడు ఏ ప్రకటన వస్తుందోమోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(మార్చి 20)న కర్నూలులో కస్టమర్లు సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. కస్టమర్లు పెద్ద ఎత్తున ఒకేసారి సూపర్ మార్కెట్లకు తరలిరావడంతో సరుకులు తీసుకునే ట్రాలీలు కూడా దొరకడం లేదు. బిల్లింగ్ కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి. కర్నూలులో ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

Recommended Video

    PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
    ఒక్క ఇండియాలోనే కాదు..

    ఒక్క ఇండియాలోనే కాదు..

    కరోనా వైరస్ కారణంగా ఒక్క ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. జనాలు వెర్రిగా సూపర్ మార్కెట్లకు పరిగెత్తి భారీ మొత్తంలో కిరాణ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా,జపాన్,ఫ్రాన్స్ సహా తదితర దేశాల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆస్ట్రేలియాలో అయితే టాయిలెట్ పేపర్ కోసం జనం ఎగబడటం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. సూపర్ మార్కెట్లకు వెళ్లే కస్టమర్లు కట్టలు,కట్టలు టాయిలెట్ పేపర్స్‌ను కొనుగోలు చేశారు. దీంతో కొన్ని సూపర్ మార్కెట్లు టాయిలెట్ పేపర్ కొనుగోళ్లపై పరిమితి కూడా విధించాయి. దీంతో కొన్ని మార్కెట్లలో కస్టమర్లు యాజమాన్యంతో గొడవపడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం మీదో కరోనా టెన్షన్ ప్రజల్లో లేని అపోహలు క్రియేట్ చేసి నిత్యావసర వస్తువులు,కిరాణ వస్తువుల కోసం హైరానా పడేలా చేసింది. ఆఖరికి ప్రధాని మోదీ స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+