వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మృతిపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్య ఏమన్నారంటే !

లిక్కర్ కింగ్ విజయ్ మాల్య జయలలిత ఆకస్మిక మృతిపై స్పందించారు. జయలలిత అస్తమించారని తెలసుకుని చాల ఆవేదన చెందానని అన్నారు. జయలలిత అనంతలోకాలకు వెళ్లిపోయి తమిళ ప్రజలకు శోకాన్ని మిగిల్చారని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తప్పి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

బ్యాంకులకు రుణం ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్య జయలలిత ఆకస్మిక మృతిపై స్పందించారు. జయలలిత అస్తమించారని తెలసుకుని చాల ఆవేదన చెందానని అన్నారు.

జయలలిత అనంతలోకాలకు వెళ్లిపోయి తమిళ ప్రజలకు శోకాన్ని మిగిల్చారని చెప్పారు. రాజకీయ నాయకురాలు అంటే జయలలిత అని ఆమెను పొగిడారు. జయలలిత ఆత్మ శాంతించాలని మాల్యకొరుకున్నారు. జయలలితకు శశికళ నటరాజన్, పన్నీర్ సెల్వం కుటుంబ సభ్యులని, వారికి ఆదేవుడు అండగా ఉండాలని, జయలలితకు ఇవే నా నివాళులు అని ట్విట్టర్ లో తెలిపారు.

అయితే విజయ్ మాల్య ట్విట్లు చేసిన తరువాత అనేక మంది ఆయనకు సోషల్ మీడియాలో జోకులతో ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు త్వరగా డబ్బులు తీసుకుని భారత్ వచ్చేయాలని ఒకరు, ఇలాంటి సమయంలో నైనా భారత్ వచ్చి జయలలితకు నివాళులు అర్పించాలని ఒకరు, మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే మీకు ఇలాగే అందరూ గౌరవం ఇస్తారని మరి కొందరు పలు విధాలుగా ట్విట్లు చేశారు.

English summary
Jayalalithaa died:Beleaguered businessman Vijay Mallya tweets about Jaya.The All India Bank Employees Association (AIBEA) has demanded that criminal action be initiated against around 8,000 loan defaulters including beleaguered businessman Vijay Mallya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X