పెళ్లి చేసుకుందాం రా టెక్కీ, కొంచెం తక్కువ రూ. కోటీ నాకేసిన కిలాడీ మేడమ్, అంతే !

న్యూఢిల్లీ: సైబర్ మోసం గురించి మీడియాలో పదేపదే వార్తలు వస్తున్నా, పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. , మీ ఖాతా నుండి డబ్బును పోగొట్టుకోవద్దని హెచ్చరించే మొబైల్ మేసేజ్ లు పుష్కలంగా వస్తున్నాయి, అయినా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. భారతదేశంలో మోసాలు, మోసపూరిత సైబర్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పోగొట్టుకున్న తరువాత పోలీసుల దగ్గరకు వెళ్లి లబోదిబో అంటున్నారు.

అటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు సులభమైన మార్గం అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వారితో టచ్ లో ఉండే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే లేనిపోని సమస్యలు వచ్చి ఆర్థికంగా నష్టపోతారని ఇప్పటికే పదేపదే పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

Believing the techie to get married, he paid Rs. 92 lakhs, The lady who stole and cheated in Pune.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఓ మహిళను కలుసుకుని ఆమె మాయమాటలు నమ్మి సుమారు రూ. 92 లక్షలు చెల్లించాడు. మహిళ మోసం చేసిందని తేలడంతో ఆ టెక్కీ డబ్బు మొత్తం పోగొట్టుకుని తనకు న్యాయం చెయ్యాలని ఇప్పుడు పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు.

చాలా మంది తమ జీవిత భాగస్వామిని సెట్ చేసుకోవడానికి ఇప్పుడు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వెబ్‌సైట్‌లలో ఉన్న కొంత మంది కస్టమర్లు అపరిచితులను, అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. తమతో ఎవరు టచ్ లో ఉన్నారు అని వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయించుకుంటే తప్ప వారిని విశ్వసించరాదని కూడా గుర్తుంచుకుంటే మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తోందని మరోసారి వెలుగు చూసింది.

మ్యాట్రిమోనీ వైబ్ సైట్ లో ఓ కిలాడి లేడీ ఆన్‌లైన్‌లో కలిసిన పూణెకు చెందిన ఐటీ ఉద్యోగి రూ. 91.75 లక్షలు లాక్కొని అతన్ని మోసం చేసినట్లు తేలింది. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ మహిళను ఆన్‌లైన్‌లో కలిశాడు. మొత్తం రూ. 91.75 లక్షలు తీసుకుని ఆ టెక్కీని ఆ మహిళ నిలువునా మోసం చేసిందని వెలుగు చూసింది.

Believing the techie to get married, he paid Rs. 92 lakhs, The lady who stole and cheated in Pune.

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో కలిసిన తర్వాత ఫోన్‌లో మాట్లాడినప్పుడు మహిళ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే పెళ్లి చేసుకుంటానని ఆ టెక్కీని నమ్మించి అతన్ని మెల్లిగా రంగంలోకి దింపింది. మహిళ మాయలో పడిపోయిన ఆ టెక్కీ తనకు మంచి అమ్మాయి దొరికిందని ఉబ్బిపోయాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టమని ఆ టెక్కీని ఆమె ఒప్పించింది.

మహిళను నమ్మిన టెక్కీ పలు బ్యాంకులు, లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నాడు. పెట్టుబడి కోసం మొత్తం రూ. 71 లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి మహిళ చెప్పినట్లు ఆ టెక్కీ ఆమె తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రూ. 86 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో ఆ టెక్కీ హడలిపోయి ఆమెను ప్రశ్నించాడు.

Believing the techie to get married, he paid Rs. 92 lakhs, The lady who stole and cheated in Pune.

ఇంత డబ్బుల ఇప్పటికే పెట్టుబడి పెట్టామని, ఇంకా కొంత డబ్బులు పెట్టాలని మళ్లీ ఆ టెక్కీని ఆమె నమ్మించింది. తరువాత ఆ టెక్కీ మరోసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినా డబ్బులు తిరిగి రాకపోవడంతో అతను అయోమయంలో పడిపోయాడు. తరువాత మహిళ మాటలు నమ్మి మళ్లీ రూ. 3. 95 లక్షలు ఒకసారి, మరోసారి రూ. 1. 8 లక్షలు చెల్లించాడు. తరువాత మేడమ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జెండా ఎత్తేసింది.

మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన పుణేలోని దేహు రోడ్‌లోని ఆదర్శ్ నగర్ నివాసం ఉంటున్న టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మహిళతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కేసు విచారణలో ఉందని, నిందితుల పేర్లు చెప్పడం కుదరని పూణే పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+