ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్, లాడ్జ్ లో దొంగనోట్లు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న కేటుగాడు, ప్లాన్ !
లోక్ సభ ఎన్నికల సమయంలో పలు పార్టీల నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వెంట ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కొందరికి డబ్బులు ఇచ్చి వారిని వెంట పిలుచుకుని వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.'
రాజకీయ పార్టీల నాయకుల వెంట వెలుతున్న యువకులకు ఉదయం టిఫిన్, మద్యాహ్నం బిర్యాని, రాత్రి క్వాటర్ మందుతో పాటు రూ 500 నుంచి రూ 1,000 వరకు నగదు కూడా ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి రూ 2000 కూడా ఇస్తున్నారని వెలుగు చూసింది. ఎన్నికల ప్రచారం సందర్బంగా భారీ మొత్తంలో ప్రతిరోజు డబ్బులు చేతులు మారుతున్నాయని ఇప్పటికే వెలుగు చూసింది. ఎన్నికల జరుగుతున్న సందర్బంగా ఇప్పుడు దొంగనోట్ల వ్యవహారం బయటకు వచ్చింది.

కర్ణాటకలోని బళ్లారి నగరంలోని ఓ లాడ్జిలో గది బుక్ చేసి నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పట్టుకున్నారు. బళ్లారి గాంధీనగర్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు .అశోక్, హరీష్ కుమార్ అరెస్టు అయిన నిందితులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. బ్యాంకులో నోట్ల చలామణి వ్యవహారంపై అవగాహన ఉన్న అశోక్ మరో నిందితుడు హరీష్ తో కలిసి నకిలీ నోట్లను ముద్రించేందుకు స్కెచ్ వేశాడు.
నకిలీ నోట్లు ముద్రించడానికి నిందితులు రహస్య ప్రాంతం కోసం వెతికారు. బళ్లారిలోని కోలాచలం కాంపౌండ్‌లోని మోహన్ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అదే లాడ్జ్ లోని గదిలో ఉంటూ నకిలీ నోట్ల ముద్రించడాని ప్లాన్ చేశారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నకిలీ నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిందితులు ఇద్దరూ భలే స్కెచ్ వేశారు. గుట్టుచప్పుడు కాకుండా నకిలినోట్లు ముద్రించి మార్కెట్ లో చలామణి చెయ్యాలని ప్లాన్ చేశారు.

పక్కా సమాచారం మేరకు సీపీఐ సిద్ధరామేశ్వర్, లేడీ ఎస్‌ఐ సౌమ్యా ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పక్కాప్లాన్ తో నిందితులను అరెస్టు చేశారు. దాడి జరిగిన సమయంలో లాడ్జి గదిలో ఉంచిన జిరాక్స్ కలర్ ప్రింట్ మిషన్, సుమారు 8, 000 విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలు ఇంకా ఎంత మంది ఉన్నారు అని విచారణ చేస్తున్నారని బళ్లారి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications