ఓటు వేసిన బళ్లారి రెడ్డి బ్రదర్స్, హైఓల్టోజ్ టెన్షన్, బళ్లారిలో భారీగా ఓటింగ్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ఓటర్లు వాళ్లవాళ్ల పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో గతంలో చక్రం తిప్పిన బళ్లారి రెడ్డి బ్రదర్స్ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అందరూ ఒకే చోట ఓటు వెయ్యలేకపోయారు. మూడు నియోజక వర్గాల్లో బళ్లారి రెడ్డి బ్రదర్స్ వారివారి ఓట్లు వేశారు.
కర్ణాటక రాజకీయాల్లో గతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఓ రైంజ్ లో ఓ వెలుగు వెలిగిన మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుపాలైన తరువాత ఆయన రాజకీయ జీవితం తల్లకిందులు అయ్యింది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి గత డిసెంబర్ నెలలో కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) స్థాపించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో బళ్లారి జిల్లాకు దూరం అయిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోప్పళ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కేఆర్ పీ పార్టీ అభ్యర్థిగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బుధవారం గంగావతిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓటు వేశారు. తనకు ఓటు వేసి గెలిపించాని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి గంగావతి ఓటర్లకు మనవి చేశారు.
గాలి జనార్దన్ రెడ్డికి పోటీగా బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఇక్బాల్ అన్సారీ పోటీలో ఉన్నారు. కర్ణాటకోని హైఓల్టోజ్ నియోజక వర్గాల్లో గంగావతి కూడా ఒక్కటి కావడంతో ఆ నియోజక వర్గంలో రారాజు ఎవరు అని మే 13వ తేదీ తెలిసిపోతుంది.
ఇక బళ్లారి సిటీలో గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ కేఆర్ పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బుధవారం గాలి లక్ష్మీ అరుణ ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వదిన లక్ష్మీ అరుణ మీద బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. బళ్లారిలో బుధవారం మద్యాహ్నం 11.30 గంటలకే 32 శాతం ఓటింగ్ జరగడంతో ఆ నియోజక వర్గం హాట్ టాపిక్ అయ్యింది.
బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీలోనే ఇద్దరి మధ్య పోటీ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి మరో సోదరుడు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి కరుణాకర్ రెడ్డి హరప్పనహళ్లి నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బుధవారం హరప్పనహళ్లిలో గాలి సోమశేఖర్ రెడ్డి ఓటు వేశారు. హరప్పనహళ్లిలోనే గాలి కరుణాకర్ రెడ్డి మకాం వేశారు.
మొత్తం మీద మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఓటు హక్కు వినియోగించకున్నారు. అయితే బళ్లారి రెడ్డి బ్రదర్స్ లో ఎంత మంది విజయం సాధిస్తారు ? అనే విషయం మే 13వ తేదీ వరకు వేచి చూడాలి. బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటక మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కూడా బుధవారం ఓటు వేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications