రివాల్వర్ తో పోలీస్ స్టేషన్ లో హల్ చల్
మంగళూరు: మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి రివాల్వర్ చూపించి మిమ్మల్ని వరుస పెట్టి చంపేస్తామని బెదిరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అసలు వీరెందుకు అంత సాహసానికి ఒడిగట్టారు అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
హాసన్ లో బట్టల వ్యాపారం చేస్తున్న దయానంద్ (37), రవి(40), హోటల్ యజమాని రంగనాథ్ భట్ (46), బెలగావికి చెందిన బసవరాజ కోడచి (27) అనే నలుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం పోలీసు అధికారులు తెలిపారు.
మంగళూరు సమీపంలోని బెల్తంగడి పోలీస్ స్టేషన్ లోకి ఈ నలుగురు వెళ్లారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ లోకనాథ్ దగ్గరకు వెళ్లి మీ ఎస్ఐ, సీఐ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. అసలు మీరెవరు అని హెడ్ కానిస్టేబుల్ లోక్ నాథ్ ప్రశ్నించడంతో దయానంద్ రెచ్చిపోయాడు.

వెంటనే దయానంద్ నడుంలో ఉన్న రివాల్వర్ తీసి లోక్ నాథం తల మీద గురి పెట్టాడు. తరువాత అక్కడ ఉన్న పోలీసులను ఒక్కోక్కరిని చంపేస్తానని బెదిరించాడు. తాను ఉన్నత పోలీసు అధికారి ఆత్మీయుడిని నాతో పెట్టుకుంటే మీ అంతు చూస్తానని అక్కడున్న పోలీసులను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. చివరికి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మద్యం మత్తులో నిందితులు ఈ విదంగా చేశారని పోలీసు అన్నారు, అక్రమంగా ఆయుధాలు పెట్టుకున్నారని, పోలీసులను బెదిరించి విధులు అడ్డుకున్నారని వీరి మీద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications