Bengal: బాంబులు వేసి పొలిటికల్ లీడర్ హత్య, ప్రతీకారం, 12 ఇండ్లకు నిప్పు, 8 మంది సజీవదహనం, గవర్నర్ !

కోల్ కత్తా: రాజకీయ కక్షల కారణంగా ఓ పొలిటికల్ లీడర్ ను బాంబులువేసి దారుణంగా హత్య చేశారు. రాజకీయ నాయకుడు హత్యకు గురి కావడంతో అతని వర్గీయులు రెచ్చిపోయారు. పొలిటికల్ లీడర్ హత్యకు ప్రతీకారంగా అతని వర్గీయులు కొన్ని ఇళ్లకు నిప్పంటించారు. ఇళ్లల్లో మహిళలు, పిల్లలు ఉన్న సమయంలో నిప్పంటించడంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు.

గాయాలైన వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని వెలుగు చూసింది. రాజకీయ కక్షల కారణంగా హత్యకు గురైన పోలిటికల్ లీడర్ అనుచరులు మారణకాండకు 8 మంది బలి అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా ఒకేసారి అనేక ఇండ్లకు మంటలు వ్యాపించాయని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు. అయితే రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలకు అమాయకులైన వ్యక్తులు బలి అయ్యారని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గరవ్నర్ సంతాపం ప్రకటించారు.

 పొలిటికల్ లీడర్ ఫినిష్

పొలిటికల్ లీడర్ ఫినిష్

పశ్చిమ బెంగాల్ లోని బిర్ భూమ్ ఏరియా సమీపంలోని రామ్ పురహత్ ప్రాంతంలో తృణమల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన నాయకుడు బాడు షేక్ అలియాస్ బాడు బాయ్ అనే వ్యక్తిని నాటు బాంబులు వేసి దారుణంగా హత్య చేశారు. టీఎంసీలో మాస్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాడు షేక్ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి.

 ఇండ్లకు నిప్పు పెట్టిన ప్రత్యర్థులు

ఇండ్లకు నిప్పు పెట్టిన ప్రత్యర్థులు

బాడు షేక్ హత్యతో రగిలిపోయిన అతని వర్గీయులు స్థానికుల మీద విరుచుకుపడ్డారు. బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు సుమారు 12 ఇండ్ల మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో ఆ ఇండ్లల్లో మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.

 8 మంది సజీవదహనం

8 మంది సజీవదహనం

బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు చేసిన ఆగడాలతో ఆ ప్రాంతంలోని 12కు పైగా ఇండ్లకు మంటలు వ్యాపించాయి. ఇండ్లకు మంటలు వ్యాపించడంతో అందులో నివాసం ఉంటున్న వారికి మంటలు అంటుకుని తీవ్రగాయాలైనాయి. ఈ ప్రమాదంలో 8 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 పరుగులు తీసిన స్థానికులు

పరుగులు తీసిన స్థానికులు

బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా ఆ ప్రాంతంలో అరాచకాలు మొదలైనాయి. మంట్లో కాలిపోయి తీవ్రగాయాలైన అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు. గాయాలైన వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని వెలుగు చూసింది. రాజకీయ కక్షల కారణంగా హత్యకు గురైన పోలిటికల్ లీడర్ అనుచరులు మారణకాండకు 8 మంది బలి అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

5. వాడికంటేనా

 విచారం వ్యక్తం చేసిన గవర్నర్

విచారం వ్యక్తం చేసిన గవర్నర్

అయితే విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా ఒకేసారి అనేక ఇండ్లకు మంటలు వ్యాపించాయని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు. బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా ఎవ్వరూ నిప్పంటింలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. అయితే రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలకు అమాయకులైన వ్యక్తులు బలి అయ్యారని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీష్ ధంకర్ విచారం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ లో కలకలం

మృతుల కుటుంబాలకు గరవ్నర్ జగదీష్ ధంకర్ సంతాపం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీకి చెందిన నాయకుడు హత్యకు గురి కావడం, రెండు వర్గాల మద్య జరిగిన గొడవల్లో 8 మంది సజీవదహనం కావడం కలకలం రేపింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+