వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:15 మందితో కలిసి పెళ్లి, మాస్క్ వేసుకొని మరీ, పేదల ఆహారం కోసం రూ.31 వేలు..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌‌లో జరిగిన వివాహం పలువురికి ఆదర్శంగా నిలిచింది. పెళ్లి కూతురు, కుమారుడు సహా వచ్చినవారంతా మాస్క్ వేసుకొని సోషల్ డిస్టన్స్ పాటించారు. తన పెళ్లి సందర్భంగా పేదలకు వరుడు రూ.31వేల అందజేయడాన్ని పలువురు కొనియాడారు.

ఖరగ్‌పూర్‌లో సౌరవ్ కర్మాకర్ ఫుడ్ కోర్టు నడిపిస్తుంటారు. లాక్ డౌన్ వల్ల అది ప్రస్తుతం మూసివేశారు. స్వాతినాథ్‌ను ఆయన గురువారం రాత్రి వివాహాం చేసుకున్నారు. లాక్ డౌన్ వల్ల స్వాతి తల్లి పెళ్లికి రాలేకపోవడం వల్ల.. తన అత్త అప్పగించే బాధ్యతలను తీసుకున్నారు. పెళ్లి సందర్భంగా దుబారా ఖర్చు చేయద్దని సౌరవ్ అనుకొన్నారు. స్థానిక క్లబ్బుకు రూ31 వేలు అందజేశారు. ఆ నగదుతో రెండురోజులపాటు క్లబ్బు 500 చొన్పున ఆహారం అందజేయనుంది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి క్లబ్బులో పేదలకు ఆహారం అందజేస్తూనే ఉన్నారు.

Bengal Couple Weds With Masks, No Guests; Donates Money To Feed Poor

పెళ్లి ఖర్చులపై కుటుంబసభ్యులతో చర్చించానని సౌరవ్ పేర్కొన్నారు. పేదలకు సాయం చేసే విషయంపై కుటుంబసభ్యులతో చర్చించానని పేర్కొన్నారు. వారు కూడా సమ్మతించడంతో డొనేషన్ ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. తన పెళ్లి సందర్భంగా పేదల కడుపు నింపడం ఆనందంగా ఉందని పెళ్లికూతురు స్వాతి తెలిపారు.

వాస్తవానికి మార్చి 13వ తేదీన వీరి వివాహం జరగాలి. కానీ సౌరవ్ తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాయిదా పడింది. అప్పటినుంచి స్వాతి.. అత్త వద్దే ఉంటూ సేవలు అందించారు. ఆమె ఆశీర్వాదంతో గురువారం వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు.

English summary
Swati Nath married Sourav Karmakar, who runs a fast food outlet now shut, in the presence of some 15 family members and friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X