Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: ఐటీ హబ్ లో విదేశీ యువతి గ్యాంగ్ రేప్, వీడియో వైరల్, మర్మాంగంలో బీర్ బాటిల్ తో ? షాక్ !

బెంగళూరు/హైదరాబాద్: ఐటీ హబ్ దేశ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. విదేశీ యువతిని చిత్రహింసలు పెట్టిన రాక్షసులు ఆమెకు బతికుండగానే నరకం చూపించారు. ఢిల్లీ నిర్బయ ఘటన తరహాలోనే ఈ దారుణం జరగడం కలకలం రేపింది. నలుగురు కామాంధులు, ఇద్దరు మహిళలు కలిసి బాంగ్లాదేశ్ యవతికి నరకం చూపించారు. బాంగ్లాదేశ్ యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆ ధరిద్రాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అత్యాచారం చేసిన తరువాత ఆ యువతి మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేయడం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి, అసోం డీజీపీ రంగంలోకి దిగారు. బెంగళూరుకు చెడ్డపేరు తీసువచ్చిన ఈ దారుణమైన కేసులో హైదరాబాద్ కు చెందిన యువకుడు ఉండటం కలకలం రేపింది. మహిళతో పాటు ఐదు మంది కిరాతకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 బెంగళూరులో అరాచకం

బెంగళూరులో అరాచకం

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర సమీపంలోని అవులహళ్లికి కూతవేటు దూరంలో ఉన్న మారగోండనహళ్ళి ప్రాంతంలోని ఎన్ఆర్ ఐ లేఔట్ లోని ఓ ఇంటిలో బాంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. వారం రోజుల క్రితమే ఈ దారుణం జరిగినా ఇన్ని రోజులు ఆ విషయం బయటకు రాలేదు. నలుగురు కామాంధులు బాంగ్లాదేశ్ కు చెందిన యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారు.

 మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేశారు

మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేశారు

యువతి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో కామాంధులు వీడియో తీశారు. నలుగురు కామాంధులకు మరో ఇద్దరు మహిళలు సహకరించిన విషయం ఆ వీడియోలో కనపడుతోంది. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత ఆమె మర్మాంగంలో ( ప్రైవేట్ పార్ట్)లో కామాంధులు మద్యం బాటిల్ (బీర్ బాటిల్) చెక్కేసి ఆమెకు నరకం చూపించారని వెలుగు చూసింది.

 సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడుతోంది.

 హైటెక్ వేశ్యవాటిక దందా ?

హైటెక్ వేశ్యవాటిక దందా ?

బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా యువతులు, మహిళలను బెంగళూరు తీసుకు వచ్చి వారితో బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని కూడా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరు తీసుకు వచ్చి ఉంటారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 ఐదు మంది అరెస్టు

ఐదు మంది అరెస్టు

బెంగళూరు గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన హకీల్ అనే కామంధులను అరెస్టు చేశారు. ఇదే కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో బాంగ్లాదేశ్ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 కేంద్ర మంత్రి, అసోం పోలీసులు ఎంట్రీ

కేంద్ర మంత్రి, అసోం పోలీసులు ఎంట్రీ

బెంగళూరులో ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో జరిగిన దారుణమై గ్యాంగ్ రేప్ గురించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ విచారం వ్యక్తం చేశారు. ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిరణ్ బిజిజూ బెంగళూరు పోలీసులకు మనవి చేశారు. అసోం పోలీసు అధికారులు సైతం ట్విట్టర్ లో వీడియోలోని నిందితుల ఫోటోలను పోస్టు చేశారు. నిందితుల గురించి మాకు సమాచారం అందిందని, బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ తో మాట్లాడి బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని అసోం పోలీసు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ లోని బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వారికి సమాచారం ఇస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Recommended Video

    Free Sanitary Napkins For Girl Students In AP చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్!!
     అమ్మాయి ప్రాణంతో ఉందా ? లేదా

    అమ్మాయి ప్రాణంతో ఉందా ? లేదా

    బెంగళూరులో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి వివరాలు చిక్కకపోవడంతో పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆమెను చిత్రహింసలకు గురి చేసి చంపేశారా ?, లేదంటే కిడ్నాప్ చేశారా ?, భయంతో ఆమె ఎక్కడికైనా పారిపోయిందా ?, లేదంటే అవమానంతో ఆత్మహత్య చేసుకుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+