ఐటీ హబ్ లో షాక్, నీళ్లు వేస్ట్ చేస్తే రూ 5 వేలు ఫైన్, అపార్ట్ మెంట్లలో అలర్ట్, దేవుడు దిగివస్తే !

కర్ణాటక రాష్ట్రంలో ఎండల ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రజలు ఎండ వేడిమికి ప్రజలు విసిగివేసారిపోతున్నారు. అలాగే బెంగళూరు నగరంలో ఇప్పటికే నీటి కొరత వేధిస్తోంది. అందువల్ల బెంగళూరులోని ఈ అపార్ట్‌మెంట్ నీటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అపార్ట్ మెంట్ నివాసులు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

బెంగళూరులో నీటి కొరత రోజురోజుకు నగరవాసులకు కొత్త సవాల్‌గా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు మహానగరంలో అనేక ప్రాంతాల్లో నీటి సమస్య, జనజీవనం క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. నీటి ట్యాంకర్లపై ఆధారపడ్డ వారికి ట్యాంకర్ నీరు కూడా అందడం లేదు. ఇదిలా ఉంటే అపార్ట్‌మెంట్లు తీసుకుంటున్న కఠిన చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Bengaluru Apartment Associations warned that they will be fined Rs 5 000 if they waste water

బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీ తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతోపాటు దీన్ని గమనించేందుకు ఓ సెక్యూరిటీ గార్డును కూడా నియమించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఇప్పుడు ఇక్కడ అపార్ట్‌మెంట్‌ లో నీటిని దుర్వినియోగం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులు పెట్టడం చర్చనీయాంశమైంది.

హౌసింగ్ సొసైటీలోని ప్రతి ఇల్లు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలి. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. నీటి వినియోగాన్ని 20% తగ్గించడం సాధ్యం కాకపోతే అదనంగా రూ.5, 000 చెల్లించాలి. నీటి సరఫరాను బట్టి నీటి లభ్యత ఉంటుందని, వేసవి చివరి దశలో 40 శాతం నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తోందని తెలిసింది. అలాగే నీటి వినియోగాన్ని తగ్గించేందుకు సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆ సొసైటీ తెలిపింది.

బెంగళూరులోని పలు హౌసింగ్ సొసైటీలు తమ నివాసితులకు రోజువారీ నీటి వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. బెంగళూరులో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. నేను నీటి సమస్యను తీవ్రంగా పరిశీలిస్తున్నామని, అధికారులందరితో సమావేశం నిర్వహించి చర్చించామని డీకే శివకుమార్ అన్నారు.

Bengaluru Apartment Associations warned that they will be fined Rs 5 000 if they waste water

నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని, బెంగళూరులో 3, 000కు పైగా బోరు బావులు ఎండిపోవడంతో నీటి సమస్య ఎక్కువ అయ్యిందని, కర్ణాటక రాష్ట్రంలోని నీటి ట్యాంకర్ యజమానులు మార్చి 7వ తేదీలోగా అధికారుల వద్ద నమోదు చేయకపోతే వారి ట్యాంకర్లను ప్రభుత్వం జప్తు చేస్తుందని డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు నీటికి ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, నీటి ట్యాంకర్ ఎంత ధరకు విక్రయిస్తున్నారు అని సంబంధిత అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా ప్రైవేట్ ట్యాంకర్ల యజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+