బాంబు పేలుడు: భవానీ పిల్లల రోదనలు, నిందితుడిని పట్టిస్తే నజరానా (ఫోటోలు)

బెంగుళూరు: బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో తమిళనాడుకు చెందిన మహిళ భవానీ బాలా (38) చనిపోయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కుటుంబ సభ్యుడు కార్తిక్ సహా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఆమె మరణ వార్త విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని మల్య ఆసుపత్రికి చేరుకున్నారు. కొత్త సంవత్సర వేడుకులను చూసేందుకు బెంగుళూరు వచ్చిన తమ తల్లి ఇక లేదని తెలుసుకున్న భవానీ బాలా పిల్లల ఆర్తనాదాలు, రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

చిన్నారులు కంట తడిపెట్టి మరీ ఏడుస్తుంటే అక్కడున్నా వారంతా చలించిపోయారు. చర్చ్ స్ట్రీట్‌లోని కోకోనట్‌ గ్రోవ్‌ రెస్టారెంట్‌ ముందున్న మొక్కల మధ్య ఈ బాంబు పేలింది. పేలుడు జరిగిన సమయంలో అటుపక్కగా నడిచి వెళుతున్న భవాని తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెతో పాటు కార్తీక్‌ (22), సందీప్‌ (33), మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.

సంఘటన స్ధలంలో గాయపడిన మరో తొమ్మిది మందిని నరసింహమూర్తి అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవానీ మృతి చెందినట్లు ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆమె చెన్నై నుంచి బెంగుళూరు వచ్చారు.

బెంగుళూరు బాంబు పేలుడు ఘటన ఖచ్చితంగా ఉగ్రవాద చర్యేనని కేంద్ర హోంశాఖ, కర్నాటక ప్రభుత్వం నిర్ధారణకు వచ్చాయి. ఈ ఘటనపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీతో దర్యాప్తు జరిపించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాంబు పేలుడు ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ తామే బాధ్యులమంటూ ప్రకటించుకోలేదు.


బెంగుళూరు బాంబు పేలుడు కేసులో నిందితుడిని పట్టిస్తే నజరానా

బెంగుళూరు బాంబు పేలుడు ఘటనపై ప్రభుత్వం స్పందించి దర్యాప్తును వేగవంతం చేసింది. బాంబు ఘటనలో నిందితుల వివరాలు అందించిన వారికి రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది.

భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి

భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి


బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో తమిళనాడుకు చెందిన మహిళ భవానీ బాలా (38) చనిపోయారు.

 భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి

భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి


ఆమె మరణ వార్త విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని మల్య ఆసుపత్రికి చేరుకున్నారు.

 భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి

భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి


కొత్త సంవత్సర వేడుకులను చూసేందుకు బెంగుళూరు వచ్చిన తమ తల్లి ఇక లేదని తెలుసుకున్న భవానీ బాలా పిల్లల ఆర్తనాదాలు, రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది.

 భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి

భవానీ పిల్లల రోదనలతో మిన్నంటిన ఆసుపత్రి


చిన్నారులు కంట తడిపెట్టి మరీ ఏడుస్తుంటే అక్కడున్నా వారంతా చలించిపోయారు. చర్చ్ స్ట్రీట్‌లోని కోకోనట్‌ గ్రోవ్‌ రెస్టారెంట్‌ ముందున్న మొక్కల మధ్య ఈ బాంబు పేలింది. పేలుడు జరిగిన సమయంలో అటుపక్కగా నడిచి వెళుతున్న భవాని తలకు బలమైన గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+