మనిషివేనా నువ్వు: కూతురి ముందు తల్లిని ఆలా చేస్తావా
బెంగళూరులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధంపై అనుమానంతో ఓ క్యాబ్ డ్రైవర్ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమె శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ సందర్భంగా డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ శాడిస్ట్ క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తోన్నారు. అతనిపై భారత న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హతురాలి పేరు రేఖ. వివాహితురాలు. ఆమె స్వస్థలం చెన్నారయపట్న. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా తన భర్తను వదిలి, తన ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివసిస్తోంది. తావరకెరెలో ఓ కాల్ సెంటర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు తుమకూరు జిల్లా శిరాకు చెందిన లోకేష్ లోహితాశ్వ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అతనితో కలిసి సహజీవనం చేస్తోంది.

దీంతో తాను పని చేస్తోన్న ప్రైవేట్ కంపెనీలోరు లోకేశ్‌కు డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్చిచ్చింది. సుమారు నాలుగు నెలల పాటు వారిద్దరూ సహజీవనం చేశారు. కెబ్బేహళ్లిలో నివాసం ఉన్నారు. రేఖకు అదే కంపెనీలో పని చేస్తోన్న మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడిందనే అనుమానాలు లోకేష్ ను పట్టి పీడించసాగాయి. ఈ కారణంగానే వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. గొడవలు తీవ్రం కావడం వల్ల రేఖ.. అతనితో కూడా విడిపోయింది.
లోకేష్ మాత్రం ఊరుకోలేదు. రేఖను మళ్లీ కలవడానికి ప్రయత్నించాడు. సోమవారం రాత్రి మాగడి రోడ్డులోని సుంకదకట్టె బస్ స్టాండ్‌లో రేఖ కోసం కాపుగాశాడు. కూతురితో కలిసి వస్తోన్న ఆమెతో గొడవపడ్డాడు. కారులోకి ఎక్కాలని బలవంతపెట్టాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో కోపం పట్టలేక జనం అందరూ చూస్తుండగానే లోకేష్ ఆమెకపై కత్తితో దాడి చేశాడు. 11 సార్లు కత్తితో పొడిచి పారిపోయాడు.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడివున్న రేఖను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తొమ్మిదేళ్ల కుమార్తె చెన్నరాయపట్నలోని రేఖ తల్లిదండ్రులకు అప్పగించారు.
-
రాజీనామాకు సిద్ధమైన సీఎం!, కానీ కండిషన్స్ ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications