రాజ్ భవన్ చూస్తానే మూడ్ వచ్చి ఆ పని చెయ్యాలని అనిపించింది, కాణిపాకం, చిత్తూరులో తిరిగేశాడు!

అర్థరాత్రి ఓ ఫోన్ కాల్ బెంగళూరు సిటీ పోలీసులను వణికించింది. స్వయంగా గవర్నర్ హడలిపోయారు. ఆ ఫోన్ దెబ్బతో పోలీసులు నివ్వెరపోయారు. డీసీపీ స్వయంగా ఘటనా స్థలానికి పరుగుతీశారు. గవర్నర్ తో సహ సీనియర్ పోలీసులను భయపెట్టిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు సక్సస్ అయ్యారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముల్‌బాగిలు సమీపంలోని వడ్డల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదివారం అర్దరాత్రి భాస్కర్ బెంగుళూరు వచ్చి సిటీ మొత్తం తిరిగి తరువాత సొంత ఊరుకు వెలుతుండగా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెంగళూరులోని రాజ్ భవన్ లో బాంబు పెట్టామని బెదిరించాడు. ప్రస్తుతం విధానసౌధ పోలీసులు నిందితుడు భాస్కర్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్బంలో నిందితుడు భాస్కర్ ఇచ్చిన సమాచారం విన్న పోలీసులు షాక్ అయ్యారు.

Bengaluru City Police arrested the accused who called the bomb threat to Karnataka Raj Bhavan near Chittoor

బెంగళూరు వచ్చిన భాస్కర్ సిటీలోని పలు ప్రాంతాలు తిరిగాడు. ఇదే సందర్బంలో కర్ణాటక హైకోర్టు, విధాన సౌధను బయట నుంచి చూసిన భాస్కర్ తరువాత సమీపంలోని రాజ్ భవన్ దగ్గరకు వెళ్లాడు. రాజ్ భవన్ చూడగానే తాను మైమరిచిపోయానని, ఎలాగైనా రాజ్ భవన్ లో బాంబు పెట్టామని ఫోన్ చెయ్యాలని అనిపించిందని భాస్కర్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

వెంటనే ఇంటర్ నెట్ లో ఎన్ ఐఏ నంబర్ ను సెర్చ్ చేసిన భాస్కర్ తరువాత రాజ్ భవన్ లో బాంబులు పెట్టి బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాత్రంతా బెంగళూరు తిరిగిన భాస్కర్ మెజెస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకంకు వెళ్లిపోయాడు. కాణిపాకంలో వినాయకుడి దర్శనం చేసుకోవాలని భాస్కర్ అక్కడికి వెళ్లాడు. బాంబు బెదిరింపు కాల్ చేయడం కోసం భాస్కర్ కొత్త సిమ్‌ని కొనుగోలు చేశాడని వెలుగు చూసింది.

Bengaluru City Police arrested the accused who called the bomb threat to Karnataka Raj Bhavan near Chittoor

ఎన్ఐఏ అధికారులు బెంగళూరు సిటీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అందరూ హడలిపోయారు. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలించారు. ఈ సమయంలో నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్నాడని ఫోన్ కాల్ ట్రేస్ చేస్తున్న పోలీసులు తెలుసుకున్నారు. విధానసౌధ పోలీసుల బృందం వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం వేల ప్రారంభించారు.

చిత్తూరు నుంచి మళబాగిలు సమీపంలోని సొంత గ్రామానికి వస్తున్న భాస్కర్ ను మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపు కాల్ చెయ్యడానికి ఒక్కరోజు ముందే భాస్కర్ కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు పాఠశాలలకు ఇటీవల బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు రావడంతో పాటు పోలీసుల విచారణకు సంబంధించిన సమాచారం కూడా భాస్కర్‌కు తెలిసిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

భాస్కర్ దగ్గర ఎలాంటి అనుమానాస్పద పదార్థం లభించలేదని పోలీసులు అన్నారు. ఇంటర్నెట్ లో ఎన్‌ఐఏ నంబర్‌ వెతికిన తరువాత భాస్కర్ ఎన్‌ఐఏ కార్యాలయానికి ఫోన్‌ చేసి రాజ్‌భవన్‌లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. మరికొద్ది క్షణాల్లో బ్లాస్ట్ అవుతుందంటూ చెప్పిన భాస్కర్ వెంటనే ఫోన్ కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు బెంగళూరు నగర పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన బెంగళూరు సిటీ పోలీసులు రాజ్‌భవన్‌ లో అన్ని చోట్లా వెతికారు.

డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వచ్చి రాజ్‌భవన్‌లో తనిఖీలు చేసినా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని గుర్తించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన టవర్‌ను ట్రేస్ చేసి సీడీఆర్‌ను పరిశీలించగా నిందితుడు భాస్కర్ నెట్‌వర్క్‌ ట్రాక్‌ను గుర్తించారు. నిందితుడు భాస్కర్ చిత్తూరు నుంచి ముళబాగిల్ కు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌లను పరిశీలిస్తే ఇప్పటి వరకు ట్రేస్ అయిన కేసులు తక్కువే. 2022లో 7 పాఠశాలలకు, ఒక విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తం 8 కేసులలో ఒక్క కేసు మాత్రమే ట్రేస్ అయ్యింది. అదేవిధంగా గత నెలలో బెంగళూరులోని పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయ కాల్స్ కావడంతో ట్రేస్ చేయడం కష్టం అని పోలీసులు అంటున్నారు.

ఆచూకీ లభించినా నిందితుడిని అరెస్ట్ చేయడం కష్టమే. ఫోన్ కాల్స్ వచ్చిన యూఆర్ఎల్ చిరునామా కనుగొనబడినప్పటికీ, నిందితులు ఎక్కడ ఉన్నారో అని ఖచ్చితమైన స్థానం గురించి సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అనుమానిత ఉగ్రవాదులు పోలీసుల మైండ్ సెట్ తో ఆడుకుని ఉండొచ్చని పోలీసు అధికారులకు అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+