బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిమ్మతిరిగిన "మూన్‌వాక్ " వీడియో ...! 24 గంటల్లోనే రోడ్ల మరమ్మత్తులు : వీడియో

|
Google Oneindia TeluguNews

Recommended Video

దిమ్మతిరిగిన 'మూన్‌వాక్ ' వీడియో

ఇటివల సిలికాన్ సిటి అయిన బెంగళూర్ ‌‌లో కురిసిన వర్షాలకు నగర రోడ్లు దారుణంగా తయారయ్యాంటూ, రోడ్ల మరమ్మతు కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపేందుకు గాను రోడ్ల ఆధ్వాన్న స్థితిపై బెంగళూర్ వాసి బాదల్ నంజుండస్వామి స్పేస్ వాక్ చేసిన త్రీడీ వీడీయో వైరల్ అయిన విషయం తెలిసిందే..దీంతో బెంగళూర్ నగరపాలక అధికారులు స్పందించారు. వీడీయో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే గుంతలు పడ్డ రోడ్లను మరమ్మత్తు చేశారు.

రోడ్ల పరిస్థితిపై విన్నూత్న నిరసన

రోడ్ల పరిస్థితిపై విన్నూత్న నిరసన

ఇటివల బెంగళూర్‌లోని వర్షాలకు రోడ్లన్ని జలమయ్యాయి. రోడ్లు దెబ్బతినడంతో కాలనీల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అయినా నగరపాలక అధికారులు పట్టించుకోలేదు. రోడ్లు మరమ్మత్తు చేయాలని కాలనీ వాసులు మొరపెట్టుకున్న అధికారుల చెవికెక్కలేదు. దీంతో బెంగళూర్‌లోని ఓ త్రీడీ పెయింటర్ తన ఆలోచనకు పదును పెట్టాడు. తనకు సృజనాత్మకతకు రోడ్ల అధ్వాన్నస్థితికి జోడించాడు. రోడ్ల స్థితిపై అధికారులకు తెలిపేందుకు విన్నూత్న వీడీయోను రూపోందించాడు.

రోడ్లపైనే స్పేక్‌వాక్...

రోడ్లపైనే స్పేక్‌వాక్...

ఓ వైపు చంద్రయాన్ ఉపగ్రహ ప్రయోగంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తూంటే ఇదే అంశాన్ని తన సమస్యకు మూలంగా తీసుకున్నా త్రీడీ పెయింటర్ బాదల్ నంజుండస్వామి, స్పేస్ సూట్ ధరించి బురద రోడ్లపై స్పేక్ వాక్ చేశాడు. స్పేస్‌లో నెమ్మదిగా నడిచినట్టుగా అడుగులో అడుగు వేసుకుంటూ వీడీయో తీశాడు. దీనికి త్రీడీ ఎఫెక్ట్స్ జోడించాడు. రోడ్ల స్థితిపై సుమారు ఒక్క నిమిషం పాటు వీడీయోను తీశాడు. ఆ వీడియో ను బెంగళూర్ నగరపాలక అధికారులను ట్యాగ్ చేస్తూ రెండు రోజుల క్రితం సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆవీడీయో వైరల్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. పలు మీడీయా సంస్థలు స్పేక్ ‌వాక్ వీడీయోను హైలైట్ చేశాయి.

వీడియోపై 24 గంటల్లో స్పందించిన అధికారులు

కాగా నుజుండస్వామి వీడియోతో బెంగళూర్ నగరపాలక సంస్థ 24 గంటల్లోనే స్పందించారు. రోడ్లపై పడిన గుంతలను పూడ్చీ వేయించారు. ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగి రోడ్ల మరమ్మత్తులు చేయించారు. దీంతో రోడ్ల మరమ్మత్తులు చేస్తున్న వీడియోను నుజుండస్వామి, ఇందుకు బాద్యులైన నగరపాలక అధికారి ఆర్ఆర్ నగర్ సీఈ ప్రభాకర్ తో పాటు ఇతర అధికారులకు కృతజ్ఝతలు తెలుపుతూ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా రోడ్లపై త్రీడీ పెయింటింగులను వేసి, వాటిని అధికారుల దృష్టిని ఆకర్షించేలా చేయడం నంజుండస్వామికి కొత్తేమీ కాదు. ఇదివరకు బెంగళూరులోనే గుంతల పడ్డ రోడ్లను సముద్రాలుగా చిత్రీకరించాడు. అయితే తాజాగా చంద్రయాన్ ప్రయోగంలో ఉన్న సయయంలో ముందు స్పేస్‌వాక్ కాదు భూమ్మిద పరిస్థితులను పరిష్కరించడన్న సోషల్ కాన్సెప్ట్ తో చేసిన వీడీయో వైరల్ అయింది.

English summary
Just 24 hours after a street artist dressed up as an astronaut and performed "moonwalk" in a viral video, drawing attention to 'crater-sized' potholes in Bengaluru, civic authorities under fire rushed to do damage control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X