లడ్దూ కావాల నాయనా లడ్డూ, మొగుడితో కలిసి ఆంటీ ఏం చేస్తోందంటే ?, దెబ్బకు లక్షల్లో!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ దేవుడి గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. గుడికి వస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని మోసం చేశారు. బెంగళూరులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ 34 లక్షల రూపాయలను ఆ దంపతులు మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు.
ముందుగా గుడికి వచ్చేవారిని టార్గెట్ చేసిన ఆ దంపతులు వారిని పరిచయం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మనకి వాళ్ళు తెలుసు అని, వాళ్లకు చెబితే మీకు ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని కిలాడీ దంపతులు చాలా మందికి మాయమాటలు చెప్పి వారిని నమ్మించి మోసం చేస్తున్నట్లు వెలుగు చూసింది. ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల నుంచి రూ 34 లక్షలు డబ్బులు తీసుకున్న దంపతులు తరువాత వారిని నిలువునా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బెంగళూరు నగరంలోని విద్యారణ్యపుర పోలీసులు కిలాడి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురిని మోసం చేసి రూ 34 లక్షలకు పైగా వసూలు చేసిన ఆడబ్బుతో దంపతులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మోసపూరిత డబ్బుతో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్, డెబిట్ కార్డులు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యారణ్యపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
బెంగళూరు నగరంలో మంచి ఉద్యోగం చేసి భారీగా డబ్బులు సంపాదించాలని వచ్చిన ఇక్కడ సరైన ఉద్యోగాలు చిక్కకపోవడంతో చాలా మంది గుడిలో దేవుడికి ప్రత్యేక పూజలు చేసి మాకు మంచి ఉద్యోగాలు వస్తే మీ మొక్కులు చెల్లించుకుంటామని వేడుకుంటున్నారు. ఇలాంటి అమయాకుల ఆశలను పెట్టుబడిగా పెట్టుకున్న దంపతులు వారిని నిలువునా మోసం చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్టు అయిన దంపతుల పేర్లు, వివరాలు పోలీసులు చెప్పడంలేదు.












Click it and Unblock the Notifications