రౌడీషీటర్ తో ఆర్థిక లావాదేవీలు, ఐటీ హబ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ క్రైమ్ స్టోరీ, పండగే పండగ!
బెంగళూరు సీసీబీ ఆర్గనైజ్డ్ క్రైమ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్‌కు రౌడీతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపిస్తూ బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు సీసీబీ ఓసీడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ జ్యోతిర్లింగ హొనకట్టి అలియాస్ జ్యోతిర్లింగను సస్పెండ్ చెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు ఇన్స్ పెక్టర్ సస్పెండ్ కు లింక్ ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సిటీలోని రౌడీషీటర్ల మీద పోలీసు అధికారులు నిఘా వేశారు. కొంతకాలం నుంచి బెంగళూరు పోలీసులు పలు ప్రాంతాల్లోని రౌడీషీటర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్లకు పిలుచుకుని వెళ్లి కోటింగ్ ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని మారతహళ్లి రౌడీ రోహిత్ మీద నిఘా వేసిన పోలీసులు అతని ఇంటి మీద దాడి చేశారు. అయితే అప్పటికే రౌడీషీటర్ మారతహళ్లి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

చివరికి పోలీసులు మారతహళ్లి రౌడీషీటర్ రోహిత్ ను పట్టుకుని అతన్ని విచారించగా అతనికి పోలీసు అధికారులతో సంబంధం ఉన్న విషయం బయటపడింది. దీనిపై బెంగళూరు సీసీబీ డీసీపీ శాఖాపరమైన విచారణ జరిపి ఇన్ స్పెక్టర్ జ్యోతిర్లింగపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తూ బెంగళూరు కమిషనర్ దయానంద్ కు నివేదిక సమర్పించారు. డీసీపీ ఇచ్చిన నివేదిక ఆదారంగా ఇన్స్ పెక్టర్ జ్యోతిర్లింగను బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ సస్పెండ్ చేశారు.
బెంగళూరు సీసీబీ ఇన్స్ పెక్టర్ జ్యోతిలింగ సీసీబీ ఓసీడబ్ల్యూ తూర్పు విభాగంలో పనిచేస్తున్నారు. మారతహళ్లి రౌడీ రోహిత్‌పై హత్య, చంపేస్తామని బెదిరించారని, ప్రాణహాని తలపెట్టారని తదితర కేసులు నమోదయ్యాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో రౌడీషీటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే రౌడీల ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేశారు. కానీ మారతహళ్లి రౌడీ రోహిత్ ఆచూకీ లభించలేదు.
చివరికి రోహిత్‌ను పిలిపించి విచారించాలని బెంగళూరు సీసీబీ డీసీపీ శ్రీనివాసగౌడ్ అధికారులను ఆదేశించారు. దీంతో రౌడీషీటర్ రోహిత్ ను పట్టుకుని బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఆ సమయంలో రౌడీ రోహిత్ మొబైల్ ఫోన్ లాక్కుని అధికారులు తనిఖీ చేయగా ఇన్స్ పెక్టర్ జ్యోతిర్లింగతో ఉన్న సన్నిహిత సంబంధాలు, రోజు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని వెలుగులోకి వచ్చాయి.
అనంతరం తదుపరి విచారణలో రౌడీ రోహిత్ ఇంతకాలం సీసీబీ పోలీసు అధికారి జ్యోతిర్లింగంకు పలుమార్లు డబ్బులు గూగుల్ పే చేసినట్లు తేలింది. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన డీసీపీ బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ కు నివేదిక సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరు నగరంలోని కొందరు రౌడీషీటర్లకు, పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications