బీజేపీకి ఈగతి పడుతుందని 2021లోనే స్వామీజీ శాపనార్తాలు, అక్షరాల నిజం అయ్యింది !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలో 2019 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని అనుకున్న బీజేపీ హైకమాండ్ ఆశలు ఆవిరి అయిపోయాయి. కర్ణాటకలో బీజేపీకి ఈగతి పడుతుందని 2021లోనే ఓ స్వామీజీ జోస్యం చెప్పడంతో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైయ్యింది.
కర్ణాటకలోని శిరహట్టి ఫక్కీరేశ్వర మఠం మఠాధిపతి దింగాలేశ్వర స్వామీజీ 2021లో మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కర్ణాటకలో బీజేపీకి దిక్కులేని పరిస్థితి ఎదురౌతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని జోస్యం చెప్పారు. ఆరోజు దింగాలేశ్వర స్వామిజీ బీజేపీకి ఎలా శాపనార్తాలు పెట్టారో ఇప్పుడు అదే అక్షరాలా నిజయం అయ్యిందని బీజేపీ నాయకులే కొందరు అంటున్నారు.

ఆరోజు దింగాలేశ్వర స్వామీజీ చెప్పిన జోస్యం నిజయం అయ్యింది. హుబ్బళి తాలుకాలోని నూల్వి క్రాస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దింగాలేశ్వర స్వామీజీ మాట్లాడారు. ఎవరి స్వార్థం కోసం యడియూరప్పను బలవంతంగా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందకు దించేశారో అందరికి తెలుసని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు.
ఆరోజు యడియూరప్ప కన్నీరు పెట్టుకుని సీఎం కుర్చీ నుంచి కిందకు దిగిపోయారని, యడియూరప్ప కన్నీటిలోనే బీజేపీ ఈ రోజు కొట్టుకుపోయిందని, యడియూరప్ప ఉసురు బీజేపీకి తగిలిందని దింగాలేశ్వర స్వామీజీ మండిపడ్డారు. యడియూరప్ప అన్ని వర్గాలు, అన్ని కులాలకు చెందిన నాయకుడు అని, ఆయన లింగాయత్ లకు మాత్రమే నాయకుడు కాదని దింగాలేశ్వర స్వామిజీ అన్నారు.

బీజేపీలో కొందరు నాయకుల పెత్తనం, ఓవర్ యాక్షన్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆపార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు. ఆరోజు బీజేపీలోని కొందరు పెద్దలు పర్సంటేజ్ లకు ఆశపడి చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాను ఆరోపిస్తే బీజేపీలోని కొందరు పెద్దలు స్వామీజీలను నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు తిట్టారని, ఆరోజు స్వామీజీలు అందరూ పెట్టిన శాపనార్తాలకు ఈ రోజు బీజేపీకి తగిన శాస్తి జరిగిందని దింగాలేశ్వర స్వామీజీ అన్నారు.
బీజేపీలోని కొందరు నాయకులు ఆ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి బీఎస్. యడియూరప్ప, జగదీష్ శెట్టర్, లక్ష్మణ సవది, కేఎస్. ఈశ్వరప్ప లాంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టేసిందని, ఈ రోజు అందుకు ఫలితం అనుభవిస్తున్నారని, కర్ణాటకలో బీజేపీ కథ అయిపోయిందని దింగాలేశ్వర స్వామీజీ మండిపడ్డారు.

దక్షిణ భారతదేశంలోని బీజేపీ నాయకులు గెలుపు గుర్రాలు అని ముందు అనుకున్న బీజేపీ హైకమాండ్ తరువాత వారిని చాలా చులకనగా, నీఛంగా చూడటం మొదలుపెట్టారని, అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని దింగాలేశ్వర స్వామీజీ ఆరోపించారు. బ్రాహ్మణుల గురించి ఆరు నెలల తరువాత తాను మీడియాతో మాట్లాడుతానని, బ్రాహ్మణుల గురించి మాట్లాడటానికి తనకు ఎలాంటి భయం లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలు బయటపెట్టి ఆరోజు తాను మాట్లాడుతానని దింగాలేశ్వర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని 2021లోనే దింగాలేశ్వర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దింగాలేశ్వర స్వామీజీ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజయం అయ్యాయని నాయకులు అంటున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications