బెంగళూరు టూర్.. కేవలం రూ. 180 కే.. క్యూ కడుతున్న టూరిస్టులు..!

కర్ణాటక రాజధాని బెంగళూరులో అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. బెంగళూరులోని ప్రముఖ పర్యటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో లాల్‌ బాగ్ బొటానికల్ గార్డెన్, బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, బెంగళూరు ప్యాలెస్ వంటి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అలాగే బెంగళూరుకు సమీపంలో ఉన్న నంది హిల్స్‌ కూడా ప్రాధాన్యతను చాటుకుంది. వీటితో పాటు మైసూరు ప్యాలెస్, చాముండి హిల్స్, మైసూరు జూ, సెయింట్ ఫిలోమినాస్ చర్చి, జలపాతాలు, బృందావన్ గార్డెన్స్ తదితర పర్యటక ప్రాంతాలను ఒక్క రోజులో కవర్ చేసే అవకాశం ఉంది. అయితే టూరిస్టుల కోసం కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం రూ. 180 కే బెంగళూరు లోకల్ టూర్ ను అందిస్తోంది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే బెంగళూరు సిటీ టూర్ మొత్తం ఒక్క రోజులో పూర్తి చేయవచ్చు. ఈ టూర్ కోసం కర్ణాటక ప్రభుత్వం కొత్తగా బెంగళూరులో అంబారీ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ప్రారంభించింది. కర్ణాటక టూరిజం శాఖ ఆధ్వర్యంలో 40 సీట్లు, ఆడియో గైడ్, పర్యాటక ప్రదేశాలు, రూ.180 టికెట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ అంబారీ టూరిస్టు బస్సు నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూసేందుకు, బస్సులో ఎక్కి, ఇష్టమైన చోట దిగి తిరిగి ఎక్కి ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు.

కర్ణాటకలోని బెంగళూరులో తొలిసారిగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కర్ణాటక టూరిజం శాఖ. త్వరలోనే కర్ణాటకలోని ఇతర ప్రముఖ పర్యటక ప్రాంతాలకూ ఈ అంబారీ బస్సు సేవలను విస్తరించాలని భావిస్తోంది కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఇక ఈ అంబారీ బస్సు వివరాలు చూస్తే.. ప్రతి బస్సులో 40 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. పూర్తిగా ఎయిర్ కండిషన్ ఉన్న లోయర్ డెక్కర్‌ లో 20 సీట్లు, ఓపెన్- టాప్ అప్పర్ డెక్కర్‌ లో 20 సీట్లు ఉంటాయి.

bengaluru Double-Decker Magic for Just rs 180 Hop On amp amp Explore Like Never Before best offer

ఇక అంబారీ బస్సు ప్రతి స్టాప్‌ కు చేరుకునే సమయంలో ఆ ప్రదేశం గురించి వివరణ ఇచ్చేందుకు బస్సులో ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. ఇది అన్ని భాషల్లో సంబంధిత పర్యటక ప్రదేశం గురించి వివరిస్తుంది. ఇక కర్ణాటక టూరిజం డిపార్ట్ మెంట్ ప్రవేశపెట్టిన ఈ బస్సు టికెట్ కేవలం రూ. 180 మాత్రమే.. టికెట్‌ లు KSTDC వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేయవచ్చు. టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 10:30 నుంచి రాత్రి 8:00 వరకు ఉంటాయి. ఇక ట్రిప్స్ మొత్తం ఐదు రూట్లలో ఉంటాయి. మొత్తం 26 పర్యాటక ప్రదేశాలను ఈ బస్సు కవర్ చేస్తుంది. ఈ బస్సు సర్వీసులపై టూరిస్టుల నుంచి విశేష స్పందన వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+