కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: తల్లిదండ్రులతో కలిసి వచ్చిన కుణిగల్ గిరి, తెలీదు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీషీటర్ కుణిగల్ గిరి శుక్రవారం బెంగళూరులోని సిట్ (ఎస్ఐటీ) కార్యాలయం దగ్గరకు వచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చిన కుణిగల్ గిరి రెండు గంటల పాటు అక్కడే ఉన్నాడు.

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: రౌడీషీటర్ కుణిగల్ గిరి విచారణ, అనంతపురంలో!

సిట్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కుణిగల్ గిరి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాడు. ఈ సందర్బంలో కుణిగల్ గిరి మీడియాతో మాట్లాడుతూ గౌరీ లంకేష్ హత్య కేసుతో తనకు, తన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

Bengaluru Gauri Lankesh murder Kunigal Giri visits SIT office

తన ప్రత్యర్థులు కావాలనే తన మీద సిట్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కుణిగల్ గిరి ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం రామనగర సెంట్రల్ జైల్లో సిట్ అధికారులు తనను విచారణ చేసి వివరాలు సేకరించారని అన్నారు. గురువారం సాయంత్రం తాను బెయిల్ మీద బయటకు వచ్చానని చెప్పాడు.

ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ తో సహ 17 మందికి బందోబస్తు!

Bengaluru Gauri Lankesh murder Kunigal Giri visits SIT office

శుక్రవారం సిట్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించడంతో తన తల్లిదండ్రులతో కలిసి స్వయంగా వచ్చానని, ఇక్కడ అధికారులు లేపోవడంతో తిరిగి వెలుతున్నానని కుణిగల్ గిరి చెప్పాడు. అధికారులు ఎప్పుడు పిలిచినా సిట్ కార్యాలయానికి రావడానికి తాను సిద్దంగా ఉన్నానని కుణిగల్ గిరి అన్నాడు. మూడు సంవత్సరాల తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీషీటర్ కుణిగల్ గిరి మరో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rowdy sheeter Kunigal Giri visited SIT office on September 15, 2017. A Special Investigations Team (SIT) set up by the Karnataka government to probe into the murder of Gauri Lankes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి