CI: డ్రగ్స్ డీలర్స్ తో పోలీసు అధికారుల డీలింగ్, ఫోటోలు తీసి కేసు పెట్టిన ఆ లీడర్స్, అర్థం అయ్యిందా !

బెంగళూరు/ బెళగావి: గంజాయి కేసులో నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా పంపించారని తిలకవాడి సీఐ దయానంద్‌ శేగుణసిపై శ్రీరామ్‌సేన హిందుస్థాన్‌ సంస్థ అధ్యక్షుడు రమాకాంత కొండుస్కర్‌ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ విషయమై కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.బి. బోరలింగయ్యకు ఫిర్యాదు చేసి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.

అర్ధరాత్రి బెళగావిలోని ఆర్‌పిడి సర్కిల్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని తిలకవాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని రమాకాంత కొండుస్కర్ ఆరోపించారు. గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తిలకవాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు తరువాత ఆ నిందితుల ఫొటోలు, గంజాయి ఫోటోలు తీసి గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Bengaluru: Inspector deal with ganja smugglers, Sri Rama Sena leaders who filed the case in Belagavi in Karnataka.

నిందితుల నుంచి డబ్బులు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని శ్రీరామసేన నాయకులు ఆరోపించారు. అంతే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే సీపీఐ ఇద్దరు పోలీసు సిబ్బంది నిందితుల నుంచి లంచం తీసుకుని వారిని వదిలేశారని శ్రీరామసేన నాయకులు ఆరోపిస్తున్నారు. గంజాయిని నిందితులకు ఇచ్చి పొలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపిచేశారని ఆరోపణలు ఉన్నాయి.

బెళగావి సిటీ పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందించిన అనంతరం మీడియాతో స్పందించిన రమాకాంత కొండుస్కర్ పోలీసులు దాడి చేసినప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు కేజీల గంజాయి దొరికింది. అనంతరం పట్టుకున్న గంజాయితో పాటు ఇద్దరు నిందితులను తిలకవాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా వారి దగ్గర డబ్బు తీసుకుని వదిలేశారని ఆరోపణలు చేశారు.

బెళగావి నగర పోలీసు కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఇలాంటి అధికారుల వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోందని, కొందరు రాజకీయ నాయకుల అండతోనే ఇలా పోలీసు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీజీపీ అలోక్ కుమార్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఈ కేసులో పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తామని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+