ఉగాది నాడే.. పట్టాలు తప్పిన బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Bengaluru-Kamakhya Superfast Express derailed: మరో రైలు ప్రమాదం సంభవించింది. ఉగాది వేడుకలు, ఛైత్ర నవరాత్రి ఉత్సవాల్లో దేశం మొత్తం మునిగివున్న వేళ.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు- కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. భూమిలోకి కూరకుపోయాయి. పట్టాలపై ఒరిగిపోయాయి.
ఒడిశాలో కొద్దిసేపటి కిందటే ఈ ఉదయం 11:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం సంభివించింది. ఈస్ట్ కోస్ట్ జోన్ ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని నెర్గుండి స్టేషన్ సమీపంలో ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు.

#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
25 మందికి గాయాలు..
ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
దాదాపుగా 54 గంటల ప్రయాణం..
బెంగళూరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి శనివారం ఉదయం 8:50 నిమిషాలకు బయలుదేరిన 12551 నంబర్ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ మూడో రోజు మధ్యాహ్నం 2:25 నిమిషాలకు అస్సాంలోని కామాఖ్యకు చేరుకోవాల్సి ఉంది. దాదాపుగా 54 గంటల పాటు ప్రయాణిస్తుందీ ఎక్స్‌ప్రెస్.
నెర్గుండి- మంగూలి చౌదార్ మధ్య..
మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈస్ట్ కోస్ట్ జోన్ ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని నెర్గుండి స్టేషన్ దాటిన కొద్దిసేపటికి మంగూలి చౌదార్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 11 బోగీలు భూమిలోకి కూరుకుపోయాయి. పెద్ద శబ్దం చేస్తూ ఆయా బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లగేజీతో బయటికి పరుగులు తీశారు.
యుద్ధ ప్రాతిపదికన..
ఈ సమాచారం అందిన వెంటనే ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులను తెప్పించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి మరో రైలును అందుబాటులోకి తెచ్చారు.
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు..
ఈ ప్రమాదం నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు పలు స్టేషన్‌లల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వీటి నంబర్లు భువనేశ్వర్ - 8455885999, 8114382371, కటక్ - 8991124238, 7205149591, ఖుర్దా రోడ్ - 06742492245, భద్రక్- 9437443469, పలాస- 9237105480, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్- 9124639558.
స్పందించిన హిమంత..
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోన్నామని అన్నారు. సహాయక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూడాలని అన్నారు.
I am aware of the incident involving 12551 Kamakhya Express in Odisha. @CMOfficeAssam is in touch with the Odisha Government and Railways. We will reach out to each and every person who is affected . @AshwiniVaishnaw @MohanMOdisha
— Himanta Biswa Sarma (@himantabiswa) March 30, 2025
రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం..
ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేవారు. కొన్ని చోట్ల పట్టాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. వాటిని పునరుద్ధరించిన తరువాతే రైళ్ల రాకపోకలకు అనుమతి ఇస్తామని ఈస్ట్ కోస్ట్ అధికారులు తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications