Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్రమ సంబంధానికి బ్రేక్, రాగిముద్దలో సైనెడ్ స్కెచ్ వేసిన భర్త, ల్యాబ్ లో వన్స్ మోర్ రొమాన్స్ తో !

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో ఓ భర్త అతని భార్యకు సైనైడ్ కలిపిన రాగి ముద్ద తినిపించి హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగిన ఈ ఘటన కాఫీనాడు ప్రజలనే కాకుండా పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. తన భార్యను తానే హత్య చేశానని భర్త అంగీకరించాడు.

భర్త హత్య రహస్యాన్ని వెల్లడించడంతో హంతకుడి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. హత్యకు గురైన మహిళ పేరు శ్వేతా. భర్త దర్శన్ రాగి ముద్దలో సైనైడ్ కలిపి అతని భార్య శ్వేతాను హత్య చేశాడని పోలీసులు అన్నారు. విచారణ జరిపిన పోలీసుల ముందు హంతకుడు దర్శన్ నేరం అంగీకరించాడని, భార్యను ఎలా హత్య చేశాను అనే రహస్యాన్ని బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు.

Bengaluru lab technicians husband killed his wife by putting cyanide in a lump of copper near Chikkamagaluru.

తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భార్య శ్వేతాను సైనెడ్ ఉపయోగించి తానే హత్య చేశానని దర్శన్ స్టేట్ మెంట్ ఇచ్చాడని చిక్కమగళూరు పోలీసు అధికారులు తెలిపారు. భార్య శ్వేతను తానే హత్య చేసి తరువాత కేసు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశానని దర్శన్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. భార్య శ్వేతాను హతమార్చిన తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయిందని కట్టుకథ అల్లాడని పోలీసులు అన్నారు.

రాత్రి భోజనంలో సైనైడ్ కలిపిన రాగి ముద్ద తన భార్యకు ఇచ్చానని, తరువాత శ్వేతా చనిపోయాక సిరంజితో ఆమె చేతికి ఇంజెక్షన్ ఇచ్చానని, ఆ తర్వాత సిరంజితో ఇంజక్షన్‌ వేసుకుని తన భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అందరిని నమ్మించాలని ప్లాన్‌ చేశానని దర్శన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ ప్లాన్ బెడిసికొడుతుందనే భయంతో దర్శన్ తన భార్య శ్వేతా గుండెపోటుతో చనిపోయిందని డ్రామా ఆడాడని పోలీసులు తెలిపారు.

శ్వేతా కుటుంబ సభ్యులు, ఆమె బంధువులు రాకముందే దర్శన్ భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. అనుమానం వచ్చిన శ్వేతా తల్లిదండ్రులు దర్శన్‌పై హత్య కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో శ్వేతాకు గుండెపోటు కాదని ప్రాథమిక నివేదిక వచ్చింది. నివేదిక అందుకున్న పోలీసులు శ్వేతా భర్త దర్శన్‌ను అదుపులోకి విచారించారు. సైనైడ్‌ కిల్లర్‌ దర్శన్‌ పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపెట్టాడు.

Bengaluru lab technicians husband killed his wife by putting cyanide in a lump of copper near Chikkamagaluru.

దర్శన్ బెంగళూరులోని కొడిగేహళ్లి సమీపంలో ట్రూ మెడిక్స్ ల్యాబ్‌ను నడుపుతున్నాడు. దర్శన్, శ్వేతా ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ట్రూ మెడిక్స్‌లో పనిచేసే ఓ వివాహిత మహిళతో దర్శన్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య శ్వేతా అతని అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచింది. ల్యాబ్ లో పని చేస్తున్న మహిళను వెంటనే ఉద్యోగం నుంచి తప్పించాలని శ్వేతా ఆమె భర్త దర్శన్ మీద ఒత్తిడి చేసింది.

శ్వేతా ఫోన్ చేసి భర్తతో ఉన్న సంబంధం వదిలేయాలని ల్యాబ్ లో పని చేస్తున్న వివాహిత మహిళను చాలాసార్లు హెచ్చరించింది.ఫోన్ చేసి ప్రియురాలిని హెచ్చరించడంతో సైనైడ్ ఇచ్చి శ్వేతాను హత్య చేయాలని దర్శన్ ప్లాన్ చేశాడు. బెంగళూరు నుంచి భార్య శ్వేతాను దేవవృంద గ్రామానికి తీసుకొచ్చి హత్య చేశారు. గోనిబీడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మొదట శ్వేతాకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే రాగి ముద్దలో సైనెడ్ కలిపి భార్య శ్వేతాను హత్య చేశానని స్వయంగా ఆమె భర్త దర్శన్ అంగీకరించడంతో పోలీసులు సైతం షాక్ కు గురైనారు. శ్వేతా శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+