బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి వ్యక్తి: ఒక్కో శునకం ఖరీదు కోటి (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: అతనికి శనకాలంటే ప్రాణం. తనకు కావాల్సిన శునకం కోసం ఎంత డబ్బు వెచ్చించడానికైనా వెనుకాడడు. అతనెవరో కాదు బెంగుళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి. కొరియన్‌ బ్రీడ్‌కు చెందిన రెండు శునకాల కోసం అతడు అక్షరాలా రూ. 2 కోట్లు చెల్లించాడు.

Bengaluru Man Becomes India's First Owner Of Rare Dog BreedThat Costs Rs. 1 Crore

ఆ రెండు శునకాలను పోషించడానికి నెలకు అయ్యే ఖర్చు రూ. 25 వేలు. దీనికి తోడు వాటిని ఏసీ గదుల్లోనే ఉంచాలి. చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించాడు. దీంతో అతడికి ఓ రికార్డు దక్కింది. అదేమిటంటే భారత్‌లో కొరియన్ బ్రీడ్‌ శునకాలను పెంచుకునే వ్యక్తి మన దేశంలో తొలి వ్యక్తి ఇతడే.

ప్రస్తుతం భారత డాగ్‌ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సతీష్ ఈ కొరియన్ బ్రీడ్ శునకాలను రోల్స్‌ రాయ్స్‌, రేంజి రోవర్‌ కార్లలో బెంగుళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ జాతి మినహా అన్ని రకాల కుక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పాడు.

Bengaluru Man Becomes India's First Owner Of Rare Dog BreedThat Costs Rs. 1 Crore

వీటి కోసం గత 20 సంవత్సరాలుగా వెతుకున్నానని చివరకు బీజింగ్‌లో ఇవి దొరకడంతో తాను ఒక్కో కుక్కకి కోటి రూపాయల మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు. బీజింగ్ నుంచి తెప్పించిన రెండు శునకాల్లో మగ, ఆడ ఉండటం విశేషం. చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఈ కొరియన్ బ్రీడ్ శునకాలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికారు.

English summary
Bengalurean Satish S, who has imported Korean Dosa mastiffs, claimed to be the first owner of the Korean breed in India. Satish, breeder and president of Indian Dog Breeders' Association, said that he imported two pups who are two-month-old, each costing approximately Rs 1 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X