ప్రతిరోజూ భార్యతో గొడవ, విడాకులు ఇస్తే ఆస్తిలో భాగం ఇవ్వాలి, భర్త మాస్టర్ ప్లాన్, చివరికి !
బెంగళూరు: ప్రతిరోజూ ఇంటిలో గొడవ పెట్టుకుంటున్న భార్యకు విడాకులు ఇస్తే జీవితాంతం భరణం ఇవ్వాలని, లేదంటే ఆస్తిలో సగభాగం ఇవ్వాలని ఆలోచించిన భర్త చివరికి మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య ప్రాణాలతో లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలోచించాడు.
అంతే స్నేహితులను పిలిపించి నా భార్యను చంపేయండి అని చెప్పాడు. నా భర్యను చంపేస్తే మీకు రూ. 15 లక్షలు ఇస్తాను, మీరు వ్యాపారం చేసుకోవచ్చని అన్నాడు. అంతే స్నేహితుడి భార్యను హత్య చెయ్యడానికి వేచి ఉన్న నిందితులు పోలీసులు చిక్కిపోయారు.

ప్రతిరోజూ గొడవ
బెంగళూరు నగరంలోని వయ్యాలి కావెల్ లో నరేంద్రబాబు, వినూత దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రతినిత్యం దంపతులు గొడవపడుతున్నారు. అయితే వయ్యాలికావెల్ లోని ఒకే ఇంటిలో నరేంద్రబాబు, వినూత దంపతులు నివాసం ఉంటున్నారు.

భార్యకు విడాకులు ఇవ్వాలి !
భార్య ప్రవర్తనతో విసిగిపోయిన నరేంద్రబాబు ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించాడు. తనకు తెలిసిన న్యాయవాదిని నరేంద్రబాబు సంప్రధించాడు. భార్యకు విడాకులు ఇస్తే జీవితాంతం ఆమెకు ప్రతినెల భరణం ఇవ్వాల్సి వస్తోందని న్యాయవాది చెప్పాడు.

ఆస్తిలో సగ భాగం, లాయర్ సలహా !
భార్యకు విడాకులు ఇస్తే నీ ఆస్తిలో సగ భాగం ఆమెకు ఇవ్వాలని న్యాయవాది చెప్పడంతో నరేంద్రబాబు భార్యకు విడాకులు ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారు. వినూతను ప్రాణాలతో లేకుండా చేస్తే భరణం ఇచ్చే పని ఉండదని, ఆస్తి మొత్తం తనకే ఉంటుందని నరేంద్రబాబు భావించాడు.

భార్య హత్యకు రూ. 15 లక్షలు !
నరేంద్రబాబు అతని స్నేహితులు చిన్నస్వామి, శ్రీధర్, అభిలాష్ లను పిలిపించాడు. తన భార్య వినూతను హత్య చెయ్యాలని, అందుకు మీకు రూ. 15 లక్షలు ఇస్తానని, వ్యాపారం చేసుకుని జీవితంలో స్థిరపడటానికి అవకాశం ఉందని వారిని నమ్మించాడు.

నా భార్యకు షాపింగ్ పిచ్చి !
భార్య హత్యకు అడ్వాన్స్ గా నరేంద్రబాబు వారికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. నా భార్యకు షాపింగ్ పిచ్చి ఉందని, ఆమె ప్రతిరోజూ బయటకు వెళ్లే విషయం మీకు తెలుసని, సమయం చూసుకుని చంపేయ్యాలని నరేంద్రబాబు సూచించాడు. లేదంటే నేను ఇంటిలో లేని సమయంలో వెళ్లి వినూతను హత్య చెయ్యాలని చెప్పాడు.

హడలిపోయిన స్థానికులు !
నరేంద్రబాబు దగ్గర కిరాయి తీసుకున్న చిన్నస్వామి, శ్రీధర్. అభిలాష్ స్నేహితుడి భార్య వినూతను హత్య చెయ్యడానికి ప్లాన్ వేశారు. ఆటోలో మారణాయుధాలు పెట్టుకుని వినూతను హత్య చెయ్యడానికి తిరిగారు. ఆటోలో మారణాయుధాలు పెట్టుకుని సంచరిస్తున్నారని గుర్తించిన స్థానికులు ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు బెండ్ తీశారు
స్థానికులు ఇచ్చిన ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు గాలించారు. ఒక్కసారిగా ఆలోను చుట్టుముట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ముగ్గురికి బెండ్ తీశారు.

వినూత ప్రాణం కాపాడిన పోలీసులు
పోలీసుల విచారణలో నరేంద్రబాబు దగ్గర కిరాయి తీసుకుని అతని భార్య వినూతను హత్య చెయ్యడానికి ప్లాన్ వేశామని నిందితులు ముగ్గురూ అంగీకరించారు. భయంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఓ మహిళ ప్రాణాలతో భయటపడిందని పోలీసులు తెలిపారు.