సాగదీస్తున్నారు, ఆ మధ్య రేప్‌లు: బెంగళూరు షాకింగ్ ఘటనపై మంత్రి
కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి అమ్మాయిలను వేధించిన ఘటన పైన మంత్రి శివకుమార్ శుక్రవారం నాడు స్పందించారు.
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి అమ్మాయిలను వేధించిన ఘటన పైన మంత్రి శివకుమార్ శుక్రవారం నాడు స్పందించారు. కొన్నిసార్లు మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలు ఇష్యూను సాగదీస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాయ్‌ఫ్రెండ్ ఉన్నా ఏం చేయలేడని అర్థమైంది!: బెంగళూరు బాధితురాలు
బెంగళూరులో జరిగిన ఘటన పైన ప్రభుత్వం స్పందిస్తోందని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తున్నామని, మాకు మీడియా, ప్రతిపక్ష పార్టీలో సహకారం ఇందుకు అవసరమని ఆయన చెప్పారు.
డిసెంబర్ 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎన్నో అత్యాచారాలు జరిగాయని, ఏదీ కూడా బయటకు రాలేదని, దేని పైన కూడా చర్చ జరగలేదని, బెంగళూరు ఇష్యూ మాత్రం సాగదీస్తున్నారన్నారు. తాము నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వేధింపులు
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 31 రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్‌లలో జరిగిన మహిళలపై వేధింపుల ఘటనలపై బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

కేసులు
పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మూడు కేసులు, సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజి చూశామని అందులో వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఈ నేపథ్యంలో ఆ వార్తలు ప్రచురించిన వార్తాసంస్థలనుంచి మరిన్ని వివరాలు కోరుతూ నోటీసులు పంపామని పోలీసులు తెలిపారు.

బెంగళూరు ఘటన
ఆ ప్రాంతంలో 1400 మంది పోలీసు సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించారని, 40 సీసీటీవీలు ఉన్నాయని వీటికి తోడు పత్రికలు, టెలివిజన్ ఛానళ్లకు సంబంధించిన కెమెరామెన్‌లు, విలేకరులు ఆ రోజు అక్కడ ఉన్నారని పోలీసులు చెప్పారు.

దర్యాఫ్తు
ఒకటో తేదీ ఉదయం కమిషనర్‌గా తన తొలిరోజున విలేకరుల సమావేశంలో మాట్లాడానని, అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఎవరూ తన దృష్టికి తీసుకు రాలేదన్నారు. జరిగిన సంఘటనలను తమ దృష్టికి తెచ్చి, దర్యాప్తునకు సహకరించాల్సిందిగా బాధితులకు, మీడియాకు విజ్ఞప్తి చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications