Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup:క్రికెట్ మ్యాచ్ లు, మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, నో క్యూ, డైరెక్టర్ ఎంట్రీ !

బెంగళూరు: బెంగుళూరులో (Bengaluru) జరుగుతున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) టోర్నీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు మెట్రో (Bengaluru Metro) ప్రత్యేక టిక్కెట్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023 అక్టోబర్ 20వ తేదీ, 26వ తేదీ, నవంబర్ 4వ తేదీ, నవంబర్ 9వ తేదీ, నవంబర్ 12వ తేదీలలో బెంగుళూరులో వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) టోర్నమెంట్‌లు జరుగుతాయి. దీనికి సంబంధించి బెంగళూరులో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) టోర్నీలు జరిగే ఈ రోజుల్లో ఉదయం 7 గంటల నుండి అన్ని మెట్రో (Bengaluru Metro)స్టేషన్లలో తిరుగు ప్రయాణ పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

ఈ పేపర్ టిక్కెట్లు కబ్బన్ పార్క్, ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ల నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత ఏదైనా మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని బీఎంఆర్‌సీఎల్ (BMRCL) తెలిపింది. ఒక పేపర్ టిక్కెట్ ధర రూ. 50 ఉంటుంది, మ్యాచ్ రోజులలో ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే క్యూఆర్ (QR) కోడ్ టిక్కెట్‌ల కొనుగోలుపై సాధారణ ధరపై 5 శాతం తగ్గింపు ఉంటుందని మెట్రో (Bengaluru Metro)అధికారులు తెలిపారు.

Bengaluru Metro officials have introduced special tickets on the days of ODI World Cup cricket matches

క్రికెట్ టోర్నమెంట్‌లు (ODI World Cup) ప్రారంభమయ్యే ముందు వాట్సాప్ లేదా మా మెట్రో యాప్ లేదా పేటీఎం ద్వారా ముందుగా కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా QR టిక్కెట్‌లను తిరుగు ప్రయాణానికి ఉపయోగించవచ్చు అని అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డ్ మరియు ఎన్ సీఎంసీ (NCMC) కార్డులను యథావిధిగా ఉపయోగించవచ్చు అని నమ్మ బెంగళూరు మెట్రో (Bengaluru Metro)అధికారులు తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కబ్బన్ పార్క్, ఎంజీ రోడ్డులో మెట్రో టికెట్ కౌంటర్లలో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించనున్నట్లు బెంగళూరు మెట్రో (Bengaluru Metro)రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) తెలిపింది. నమ్మ బెంగళూరు మెట్రో (Bengaluru Metro)మొత్తం ఊదారంగు మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.

Bengaluru Metro officials have introduced special tickets on the days of ODI World Cup cricket matches

గత బుధవారం ఒక్కరోజే నమ్మ బెంగళూరు మెట్రోలో (Bengaluru Metro) ప్రయాణికుల సంఖ్య 7 లక్షలు దాటింది. అక్టోబర్ 17వ తేదీన 3,33,152 మంది మెట్రో ప్రయాణికులు పర్పుల్ లైన్‌లో ప్రయాణించారు. 2,41,297 మంది ప్రయాణికులు గ్రీన్ రూట్‌లో ప్రయాణించారు. కెంపేగౌడ మెట్రో రైల్వే స్టేషన్ (మెజస్టిక్) రూట్ మార్పులో 1, 38, 091 మంది ప్రయాణించారు.

ఒకే రోజులో మొత్తం 7,12,540 మంది మెట్రో రైలులో (Bengaluru Metro) ప్రయాణించారు. బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్లి నుంచి కాడుగోడి వరకు మెట్రో రైలు సేవలు మొదలైనాయి. కాడుగోడి నుంచి కేఆర్ పురం వరకు మాత్రమే ఉన్న మెట్రో రైలు (Bengaluru Metro)సేవలు ఇటీవల కేఆర్ పురం మెట్రో స్టేషన్ నుంచి బయ్యప్పనహళ్లి వరకు ప్రారంభం అయ్యాయి. మొత్తం మీద బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి మెట్రో రైలు సంచరించే మార్గాల్లో ఎక్కువగా మెట్రో రైలు (Bengaluru Metro) లోనే సంచరించడానికి బెంగళూరు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+