ఉగ్రవాదులు స్కెచ్, టార్గెట్ ఐటీ హబ్ ?, గుడ్ మార్నింగ్ చెప్పిన ఎన్ఐఏ, న్యూఇయర్ రోజు ప్లాన్ !

క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల ఆగడాలు అడ్డుకోవడానికి బెంగళూరు నగరంలో ఎన్ఐఏ దాడులు చేశారు. బెంగళూరులోని పలు ప్రాంతాలపై నిఘా వేసిన ఎన్ఐఏ అధికారులు పంజా విసరడంతో దాడులు కొనసాగుతున్నాయి.

దీనికి సంబంధించి బుధవారం ఉదయం బెంగళూరులోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. అనుమానాస్పద ఉగ్రవాదులకు సంబంధించిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) అధికారులు బుధవారం ఉదయం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బెంగళూరులోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు

Bengaluru NIA searches on the suspicion that terrorists will attack on the occasion of Christmas and New Year

బెంగళూరు నగరంలో మొత్తం ఆరు చోట్ల ఆరు ప్రత్యేక టీమ్ లతో ఎన్ఐఏ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ స్థలంలో ఎన్‌ఐఏ అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో గతంలో అరెస్టు అయిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన కేసుకు ఈ దాడులు సంబంధించినవిగా కన్నడ మీడియా చెబుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముదాసిర్, జాహిద్, తబ్రేజ్ మహ్మద్ ఉమర్‌లను ముందుగా అరెస్టు చేశారు.

బెంగళూరులోని హెబ్బాళ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ పాళ్య ప్రాంతంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ( బెంగళూరు సీసీబీ) జూలై 1వ తేదీన దాడులు చేసింది. ఆ తర్వాత బెంగళూరు సీసీబీ పోలీసులు ఆ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ఈ దాడిలో ఎన్ఐఏ ఏడు పిస్టల్స్, 45 లైవ్ బుల్లెట్లు, గ్రెనేడ్లు, వాకీటాకీలతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

జునైద్ అనే అనుమానితుడు విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అరెస్టు అయిన వారికి వరుస బాంబు పేలుళ్లకు శిక్షణ ఇస్తున్నాడని అదుపులోకి తీసుకున్న వారిని విచారణ చెయ్యగా ఆ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. అరెస్టు అయిన ఉగ్రవాదులు క్రిస్మస్, న్యూ ఇయర్ లక్ష్యంగా చేసుకుని బెంగళూరు నగరంలో దాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్న సందర్బంగా మరింత సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+