ఒబామా దంపతుల పేర ట్రస్ట్, మోసం: 8మంది అరెస్ట్
బెంగళూరు: అమెరికా అధ్యక్ష దంపతులు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా పేరిట నకిలీ ట్రస్టు (ఫౌండేషన్) స్థాపించి మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠా గుట్టురట్టయింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నైజీరియాకు చెందిన బోలాజి (36), అతడి భార్య చుకుఒకపాల (30), అవేరియల్ లావల్ (24), ఓకాజికాలింగ్ (28), ఓజాలావల్ (30), క్రస్టినాఒబినా (31) నిందితులను అరెస్ట్ చేశారు.
ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకు కారు, ఇతర విలాస వస్తువులు విక్రయిస్తున్నట్లు ప్రచారం చేసి ప్రజల నుంచి భారీ మొత్తం నగదు సేకరించి మోసగిస్తున్నారనే ఆరోపణపై వీరిని బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కాగా, వారి విచారణలో పలు నేరాలు వెలుగుచూశాయి.

నిందితులు నకిలీ పాస్‌పోర్టులు, వీసా, పాన్‌కార్డు తయారుచేసి తమ దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నగదు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. వీరి నుంచి రూ.99వేల నగదు, పాస్‌పోర్టులు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో వీరిచ్చే ప్రకటనలను చూసి పలువురు మోసపోయి.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వందకు పైగా సెల్‌ఫోన్లుసిమ్ కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications