మాజీ సీఎంకు కరెంట్ బిల్లు కంటే యోగ్యత లేదా ?, చాలెంజ్, చూసుకుందాం వస్తారా ?, లేదా ?
మాజీ ప్రధాని కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామికి, కర్ణాటక కాంగ్రెస్‌కు మధ్య చిచ్చు రాజుకుంది. తన మీద రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అందులో చీఫ్ ట్రిక్స్ ఉన్నాయని స్వయంగా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది.
తనపై విద్యుత్ చోరీ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారని, తాను తప్పు చేశానని అధికార పార్టీ నాయకులు నిరూపించాలని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి సవాల్ విసిరారు. ఇంతకీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఏం ఆరోపణలు చేశారు అని తెలుసుకున్న ప్రజలు హడలిపోయారు. మాజీ సీఎం మీద అధికార పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

బెంగళూరు నగరంలోని జేపీ నగర్ లో హెచ్ డీ. కుమారస్వామి నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగ సందర్బంగా విద్యుత్ స్తంభం నుండి నేరుగా అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇంటికి తీసుకున్నారని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఓ మాజీ సీఎం కరెంటు దొంగతనానికి పాల్పడటం విషాదం అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.
తనపై కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చెయ్యడం విచిత్రంగా ఉందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దీపావళి పండుగకు నా ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను అడిగానని, మా ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించడానికి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్తు సరఫరా అవుతుందా లేదా అని చెక్ చెయ్యడానికి వాళ్లు ప్రయత్నించారని. అప్పుడు నేను బిడదిలోని తన తోటలో ఉన్నానని మాజీ సీఎం కుమారస్వామి అంటున్నారు.
నిన్న రాత్రి తాను బెంగళూరులోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, వెంటనే దాన్ని తీసేసి ఇంటి మీటర్ బోర్డు నుంచి కరెంటు కనెక్ట్ చేయాలని తాను కాంట్రాక్టు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తికి చెప్పానని, తరువాత అతను ఆకరెంట్ కనెక్షన్ తీసివేశాడని, ఇందులో దాచడానికి ఏమీ లేదు అని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అన్నారు.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు తాను చింతిస్తున్నానని, అయితే నేను జరిమానా చెల్లిస్తాని చెబుతున్నానని, బెస్కాం అదికారులు వచ్చి ఎంత ఫైన్ కట్టాలి అని చెబితే తాను ఫైన్ కడుతానని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు. నేను ఎలాంటి రాష్ట్ర ఆస్తులను కాజేయలేదని, ప్రభుత్వ భూమలు లాక్కోలేదని, అధికారంలో ఉంటూ మరొకరి రక్తం తాగడంలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.
నేను ఇంట్లోనే ఉన్నానని, బెస్కామ్ అధికారులు వచ్చి తనకు నోటీసులు ఇచ్చిన తరువాత కూడా తాను స్పందించకుంటే వాళ్లు కేసు నమోదు చెయ్యాలని, అలాంటిది ఏమీలేకుండా నేరుగా కేసు నమోదు చెయ్యడం విడ్డూరంగా ఉందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. అయితే మాజీ సీఎం కుమారస్వామి ఇలాంటి పని చేసి ఉంటారా ?, విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన వ్యక్తి పొరపాటున ఏమైనా చేసి ఉంటాడా ? అని పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications