valley: వేల అడుగల లోయలో మూడు రోజు వెతికి వెతికి విసిగిపోయిన పోలీసులు, 9 నెలల క్రితం !
బెంగళూరు: దారుణ హత్యకు గురైన బెంగళూరు యువకుడి శవం కోసం బెంగళూరు పోలీసులు మూడు రోజుల నుంచి గాలించి గాలించి విసిగిపోయారు. గత మూడు రోజులుగా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా చార్మాడి ఘాట్‌లో బెంగళూరు యువకుడు శరత్ మృతదేహం కోసం వెతుకుతున్న బెంగళూరు పోలీసులు చివరికి ఒట్టి చేతులతో వెనుతిరిగి వచ్చారు. తోమ్మిది నెలల క్రితం లోయలో విసిరేసిన శవాన్ని గుర్తించాలని 30 మంది మూడు రోజుల పాటు వెతికివెతికి విసిగిపోయారు.

కిడ్నాప్ చేసి చంపేశారు
10 మందికి పైగా పోలీసులు, 20 మందికి పైగా స్థానికుల నేతృత్వంలో మూడు రోజులపాటు నిరంతర చార్మాడి ఘాట్ లో శరత్ శవం కోసం వెతుకులాట చేసినా అతని మృతదేహం మాత్రం చిక్కలేదు.
బెంగళూరు కోననకుంటెకు చెందిన శరత్ సబ్సిడీపై కారు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. కారు ఇవ్వకపోవడంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి శరత్‌ను కిడ్నాప్ చేసి చిక్కబళ్లాపురం సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా చంపేశారు.

చిక్కమగళూరు జిల్లాలో శవం విసిరేసి ?
హత్య అనంతరం శరత్ మృతదేహాన్ని చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకాలోని చార్మడి ఘాట్ అటవీ ప్రాంతంలో పడేసి బెంగళూరు వచకచేశారు, తొమ్మిది నెలల తరువాత శరత్ హత్య గురైన విషయం వెలుగులోకి వచ్చింది. శరత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

9 నెలల క్రితం హత్య
డు రోజులుగా చర్మాడి ఘాట్ లో శరత్ మృతదేహం కోసం వెతికారు. అయితే 9 నెలలు గడుస్తున్నా మృతదేహం జాడ పోలీసులకు లభించలేదు. అలాగే, నిందితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నందున, వారు మృతదేహాన్ని కనుగొనే ఆపరేషన్‌ను మధ్యలో నిలిపివేసిన బెంగళూరు పోలీసులు ఖాళీ చేతులతో బెంగళూరుకు తిరిగి వచ్చారు.

వేల అడుగుల లోయలో శవం విసిరేశారు
వేల అడుగుల లోయలో లక్షలాది హెక్టార్ల అటవీ ప్రాంతంలో 9 నెలల క్రితం మృత దేహం కోసం వెతకడం దండగా అని పోలీసులు అనుకున్నారని తెలిసింది. శరత్ మృతదేహాన్ని కనుగొనడం అసాధ్యం. చార్మాడి ఘాట్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, ముఖ్యంగా అడవి పందులు తదితర జంతువులు ఎక్కువగా ఉన్నాయి.

లాభం లేదని వచ్చేసిన పోలీసులు
హత్యానంతరం శరత్ మృతదేహాన్ని గోనె సంచిలో వేసి పారేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. కాబట్టి వన్యప్రాణులు గోనె సంచిని లాగించే అవకాశం ఉంది. శరత్ ను రాత్రిపూట హత్య చేసి మృతదేహాన్ని చర్మాడి ఘాట్ లో రాత్రిపూట విసిరివేయడంతో నిందితులు కూడా కచ్చితమైన స్థలం గుర్తించలేకపోతున్నారని తెలిసింది. మూడు రోజులుగా నిరంతరం చర్మాడి ఘాట్ లో వెతికిన పోలీసులు శుక్రవారం ఖాళీ చేతులతో బెంగళూరుకు వెనుతిరి వచ్చారు.












Click it and Unblock the Notifications