బెంగళూరులో టీ కూడా తాగలేము, ఇంత ధరలు దేశంలో ఎక్కడా లేవు, ఎత్తిలోపల ఏచేశారు!

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) నగరంలో కన్నడిగులతో పాటు దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. బెంగళూరు నగరంలో చాలా మంది వలస వచ్చిన వారు ఉద్యోగాలు చేస్తుంటే కొందరు మాత్రం వ్యాపారాలు చేస్తున్నారు. చాలా మంది ప్రజలు ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్న ప్రజలు ఇక్కడే నివాసం ఉంటున్నారు. బెంగళూరులో (Bengaluru) బతకడానికి వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడే సంపాధిస్తూ ఇక్కడి నీరు తాగుతూ, ఇక్కడి గాలి పీలుస్తూ కన్నడిగులను చులకనగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Bengaluru Police arrested a private company employee who insulted Kannadigas

పశ్చిమ బెంగాల్ కు చెందిన నిలయ్ మండల్ అలియాస్ నిలయ్ అనే వ్యక్తి బెంగళూరు (Bengaluru) చేరుకుని మంచి ఉద్యోగం కోసం వెతికాడు. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాధించిన నిలయ్ మండల్ మంచి జీతం తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోనే (Bengaluru) నివాసం ఉంటున్న నిలయ్ మండల్ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.

బెంగళూరులోనే (Bengaluru) నివాసం ఉంటున్న నిలయ్ మండల్ గ్రహాలు అనుకూలించకపోవడంతో చివరికి అరెస్టు అయ్యాడు. బెంగళూరులో టీలు, కాఫీలు, టిఫిన్లతో పాటు ఆహారపదార్థాలు తీసుకున్నా రేట్లు అధికంగా ఉన్నాయని, భోజనాలతో పాటు ఆహారపదార్థాలు ధరలు మండిపోతున్నాయని, ఇంటి అద్దెలు ఆకాశానికి తాకుతున్నాయని, బెంగళూరు (Bengaluru) ప్రజలు కన్నడలోనే మాట్లాడాలని నిత్యం ఒత్తిడి చేస్తూ టార్చర్ పెడుతున్నారని నిలయ్ మండల్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

ఈ విషయం గమనించిన కన్నడిగులు బెంగళూరు (Bengaluru) నగరంలోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన నిలయ్ మండల్ ను అరెస్టు చేశారు. కన్నడిగులను కించపరిచి తప్పుడు ప్రచారం చేస్తున్న నిందితుడు మండల్ ను విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+