గనుల శాఖ మేడమ్ హత్య కేసులో ట్విస్ట్, కర్ణాటక బార్డర్ లో హంతకుడు అరెస్టు, ఏం జరిగిందంటే ?
బెంగళూరు: ఐటీ హబ్ లో కర్ణాటక గనుల శాఖ సీనియర్ అధికారిని ప్రతిమా హత్యకు గురి కావడంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. కర్ణాటక గనులు, భూగర్భ శాఖా అధికారిణి ప్రతిమా హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సిన్సియర్ అధికారిని ప్రతిమాను దారుణంగా హత్య చేసిన నిందితుడిని బెంగళూరు సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని బెంగళూరు పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల విచారణలో తాను ఒక్కడే ప్రతిమా మేడమ్ ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని తేలిందని, గునుల శాఖా అధికారిని ప్రతిమాను ఆమె మాజీ కారు డ్రైవర్ కిరణ్ హత్య చేసినట్లు తేలింది.

నిందితుడు కిరణ్ హత్య చేసి కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని చామరాజనగర్ జిల్లాకు పారిపోయి కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడని పోలీసు అధికారులు తెలిపారు.
కిరణ్ మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు.. నిందితుడు కిరణ్ చామరాజనగర్‌లోని మహదేశ్వర్ కొండపై ఉన్నాడని కచ్చితమైన సమాచారం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు అక్కడికి బయలుదేరారు. మార్గం మధ్యలో చామరాజనగర్ పోలీసులకు కిరణ్ గురించి సమాచారం అందించి అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అనంతరం చామరాజనగర్ పోలీసులు మహదేశ్వర్ కొండకు వెళ్లి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెంగళూరులోని సుబ్రమణ్యపూర్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కారు డ్రైవర్ కిరణ్ ను బెంగళూరుకు పిలుచుకుని వచ్చారు. కిరణ్ గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన గనుల శాఖలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కిరణ్ తండ్రి సురేష్ కూడా అదే డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్ గా పని చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
విచారణలో నిందితుడు కిరణ్ 10 రోజుల క్రితం తనను ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు కోపంగా ఉన్నానని, అందుకే ప్రతిమాను హత్య చెయ్యాలని డిసైడ్ అయ్యాయని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు కిరణ్‌ను సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

కొన్ని విషయాల్లో ప్రతిమా, కిరణ్ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో 10 రోజుల క్రితం అతడిని ప్రతిమా ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కిరణ్ ప్రతిమాపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిసింది. దీంతో ప్రతిమా ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేసి వెళ్లిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. ప్రతిమా హత్యకు కుటుంబ సభ్యులే కారణమని, అక్రమ క్వారీల తవ్వకాలను నిలిపివేసిన ప్రతిమాను హత్య చేశారని మొదట అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే చివరికి కారు డ్రైవర్ కిరణ్ ను ఉద్యోగం నుంచి తప్పించారని పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో బెంగళూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పు ప్రతిమా హత్యకు ఆమె మాజీ కారు డ్రైవర్ కిరణ్ కారణమని స్పష్టమైంది. ప్రతిమా కర్ణాటక గునుల శాఖలో మంచి సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారని ఆమె సాటి ఉద్యోగులు అంటున్నారు.












Click it and Unblock the Notifications