విధానసౌధ మీద డ్రోన్ లో ఎగరేశారు. జీపులో ఎత్తేసుకుని వెళ్లిన పోలీసులు, నోఫ్లైజోన్ !
బెంగళూరు: కర్ణాటక రాజధాని పరిపాలన, అసెంబ్లీ సమావేశాలు మొత్తం బెంగళూరులోని విధాన సౌధలో జరుగుతాయి. కర్ణాటక ప్రభుత్వ శాఖ అధికారులు నిత్యం విధాన సౌధలో సంచరిస్తుంటారు. నాయకులు, మీడియా ప్రతినిధులు, అధికారులు ఇలా ఎవ్వరు విధాన సౌధలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా అక్కడి పోలీసులకు, భధ్రతా సిబ్బందికి ఐడీ కార్డులు చూపించాలి.
విధాన సౌధలోకి ఎందుకు వెలుతున్నాము అంటూ అక్కడి భధ్రతా సిబ్బందికి వివరణ ఇవ్వాలి. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఎంట్టరీ పాస్ లు ఇస్తారు. ఇలాంటి విధాన సౌధలో ప్రతిరోు 24 గంటలు భారీ బందోబస్తు ఉంటుంది. విధాన సౌధ పోలీసులతో పాటు అక్కడి మార్షల్స్ విధానసౌధలో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

విధాన సౌధలో సామాన్య ప్రజలు ప్రవేశించడానికి నిషేధించారు. అనుమతి లేకుండా విధాన సౌద ప్రాంగణంలో డ్రోన్ కెమెరాను ఎగురవేశారనే అభియోగంపై ఇద్దరు యువకులను విధాన సౌధ పోలీసులు అరెస్టు చేశారు, ఆ తర్వాత ఇద్దరిని విచారణించిన పోలీసులు స్టేషన్ బెయిల్ మీద వారిని విడుదల చేశారు. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉద్యోగులు అరుణ్, వినోద్ బాబులను అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
జూన్ 28వ తేదీ ఉదయం విధానసౌధ తూర్పు ద్వారం దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై డ్రోన్ కెమెరా ఎగిరింది. ఇది చూసిన పెట్రోలింగ్ పోలీసులు వినోద్ బాబు. అరుణ్ లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం అతిక్రమణ, నిర్లక్ష్యంగా విధాన సౌధ పరిసర ప్రాంతాల్లో నియమాలు ఉల్లంఘించి డ్రోన్ లు ఎగరవేశారని అభియోగాల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

విచారణలో నిందితులు మాట్లాడుతూ కంపెనీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వీడియోను రూపొందించేందుకే తాము విధానసౌదలోని దృశ్యాలను చిత్రీకరించేందుకు వచ్చామని చెప్పారని పోలీసులు అన్నారు. విధానసౌధ ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్ అన్న సంగతి వారికి తెలియదని పోలీసు అధికారులు అన్నారు.
అందుకే డ్రోన్ కెమెరాతో విధానసౌధను చిత్రీకరించేందుకు ప్రయత్నించామని ఇద్దరు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించి షూటింగ్ చేయడం నిషేధించబడింది. మరోసారి ఇలాంటి తప్పు చేయవద్దని హెచ్చరించిన విధానసౌధ పోలీసులు ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు విధాన సౌధ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications